కారు బోల్తా.. విజిలెన్స్ సీఐకి గాయాలు

Sun,January 20, 2019 09:41 PM

road accident in suryapet today

నాగారం: రోడ్డు ప్రమాదంలో కారు బోల్తా పడి విజిలెన్స్ సీఐకి గాయాలైన సంఘటన సూర్యాపేట జిల్లా నాగారం మండల పరిధిలోని నాగారంబంగ్లా వద్ద ఆదివారం తెల్లవారుజామున చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం సంగారెడ్డి జిల్లాలోని విజిలెన్స్ సీఐగా పని చేస్తున్న పెరుమాళ్ల నిర్మల తన తల్లిగారి స్వస్థలమైన నాగారానికి వచ్చి తన సొంత పనిపై తిరిగి తిరుమలగిరి వైపు కారులో తన కుమార్తె జాజి, అల్లుడు చింటు, చెల్లి కొడుకు సుహాన్‌లతో కలిసి వెళ్తున్నారు.

నాగారం బంగ్లా శివారులోని రైస్‌మిల్లు వద్ద కారు అదుపు తప్పి పల్టీ కొట్టింది. ఈ ఘటనలో నిర్మలకు తీవ్ర గాయాలు కాగా ముగ్గురు చిన్నారులకు స్వల్పంగా గాయాలయ్యాయి. బాధితులను చికిత్స నిమిత్తం హైదరాబాద్‌కు తరలించారు. సంఘటన స్థలాన్ని నాగారం సీఐ జె.రవిందర్, ఎస్.ఐ ఎం.లింగం పరిశీలించారు.

1184
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles