రైస్ పుల్లింగ్ పేరిట మోసం

Thu,June 13, 2019 10:06 AM

rice pulling fraud accused arrested in hyderabad

హైదరాబాద్ : రైస్ పుల్లింగ్ పేరిట మోసం చేస్తున్న ముఠాలోని సభ్యుడిని సైబరాబాద్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అతని నుంచి రూ.18 లక్షలను స్వాధీనం చేసుకున్నారు. మరో ఇద్దరు నిందితులు పరారీలో ఉన్నారు. గచ్చిబౌలిలోని డీసీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాదాపూర్ డీసీపీ వెంకటేశ్వరరావు వివరాలు వెల్లడించారు. ముంబై బాంద్రా వెస్ట్‌కు చెందిన జితేష్ శాంతిలాల్ సోలంకి (41).. స్నేహితుడు ముంబైకి చెందిన సమీర్ రాయ్‌కు రూ.15 లక్షలు ఇచ్చాడు. ఇటీవల తన డబ్బు తిరిగి ఇవ్వాలని సమీర్‌ను కోరాడు. దీంతో సమీర్.. తనకు త్వరలో భారీ డీల్ రాబోతుంది, అది వచ్చిన వెంటనే డబ్బు చెల్లిస్తానని చెప్పాడు. డీల్ విషయమై అడుగగా.. రోసారం కంపెనీ తరఫున పనిచేస్తున్న ఆంధ్రప్రదేశ్ విశాఖపట్నంకు చెందిన సింగంపల్లి వాసు అలియాస్ ఎస్‌వీ దేవకు రైస్ పుల్లింగ్ యజమానికి మధ్య బేరం కుదురుతుందని, అందులో తన కమీషన్‌గా దాదాపు రూ.300 కోట్లు రాబోతుందని నమ్మించాడు. వెంటనే అతను.. తనకు పరిచయం ఉన్న రాజ్‌ఖాన్‌ను సంప్రదించాడు.

రాజ్‌ఖా న్ వద్ద ఉన్న రైస్ పుల్లర్‌ను అమ్ముతామని, ఇందుకోసం ఎస్‌వీ దేవను సంప్రదించాలని సమీర్‌కు సూచించాడు. ఈ మేరకు గోవాలోని వివంతా హోటల్‌లో జనవరిలో సమావేశమయ్యారు. సమావేశం తరువాత ఎస్‌వీ దేవ, సమీర్, రాజ్‌ఖాన్‌లు కలిసి శాంతిలాల్‌ను మోసం చేయాలని నిర్ణయించుకున్నారు. అనంతరం తన వద్ద ఉన్న వస్తువు నమూనాను రోసా రం సంస్థకు పంపించగా.. మొత్తం రూ.3.26 కోట్లకు బేరం కుదిరిందని, కొన్ని కారణాల వల్ల ఆ సంస్థ బేరం వదులుకుందని చెప్పారు. అనంతరం నలుగురు సమావేశ మై పథకం ప్రకారం... సదరు రైస్ పుల్లర్‌ను తామే కొనుగోలు చే యాలని నిర్ణయించుకున్నారు. ఎస్‌వీ దేవ రూ.1.63 కోట్లు, రాజ్‌ఖాన్ రూ.1.10 కోట్లు, శాంతిలాల్ రూ.52.30 లక్షలు చెల్లించాలని నిర్ణయించుకున్నారు.

ఈ మేరకు శాంతిలాల్ తన వద్ద ఉన్న రూ.32 లక్షలను గచ్చిబౌలిలోని ఆదిత్య రెసిడెన్సీలో సమావేశమై రాజ్‌ఖాన్ సమక్షంలో ఎస్‌వీ దేవకు ఇచ్చాడు. డబ్బు ఇచ్చిన అనంతరం శాంతిలాల్.. సమీర్ రాజ్, ఎస్‌వీ దేవ, రాజ్‌ఖాన్‌లను రైస్ పుల్లర్ చూపించమని అడుగుతూ వచ్చాడు. వారు ఎంతకూ చూపించకపోగా రాజ్‌ఖాన్ పరారయ్యాడు. దీంతో శాంతిలాల్ ఈనెల 6న గచ్చిబౌలి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు శాంతిలాల్‌ను మోసం చేసిన ఎస్‌వీ దేవను అరెస్ట్ చేసి అతని వద్ద నుంచి రూ.18 లక్షల నగదును స్వాధీనం చేసుకున్నారు. కాగా.. మరో ఇద్దరు నిందితులు సమీర్ రాయ్, రాజ్‌ఖాన్‌లు పరారీలో ఉన్నారు.

901
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles