ఉద్యమనేత పోతరాజు అస్తమయం

Fri,January 9, 2015 07:08 PM

Revolutionary Writers Association

Revolutionary Writers Association Potaraju

కరీంనగర్ : విప్లవ రచయితల సంఘం వ్యవస్థాపక సభ్యుడు, పౌరహక్కుల ఉద్యమకారుడు తాడిగిరి పోతరాజు(80) తుదిశ్వాస విడిచారు. కరీంనగర్‌లోని తిరుమలనగర్ ప్రాంతంలో నివాసముంటున్న ఆయన, కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆయన ఈ రోజు కన్నుమూశారు. రేపు ఎల్కతుర్తి మండలంలోని పోతరాజు స్వస్థలం కోతులనడుమ అనుబంధ గ్రామం శాంతినగర్‌లో అంత్యక్రియలు నిర్వహిస్తామని బంధువులు తెలిపారు. విరసం వ్యవస్థాపక సభ్యుల్లో పోతరాజు ఒకరు. దేశంలో అత్యవసర పరిస్థితి సమయంలో విప్లవోద్యమ నేతగా వెలుగొందారు. పౌరహక్కుల నేతగా పలు సవాళ్లను ఎదుర్కొన్నారు. కరీంనగర్, హుజురాబాద్‌లలో ఆంగ్ల ఆచార్యులుగా పనిచేసి ప్రిన్సిపాల్‌గా ఉద్యోగవిరమణ పొందిన పోతరాజు తెలుగులో ప్రసిద్ధ నవల, కథా రచయిత.

674
Follow us on : Facebook | Twitter
Tags

More News

VIRAL NEWS