శ్రీరాంసాగర్ ఆయకట్టుకు నీటి విడుదలపై సమీక్ష

Tue,August 21, 2018 12:28 PM

review on water release to sriramsagar irrigation areas

హైదరాబాద్: ఉత్తర తెలంగాణ వరప్రదాయిని శ్రీరాంసాగర్ ప్రాజెక్టు ఆయకట్టుకు నీటి విడుదలపై జలసౌదాలో సమీక్ష సమావేశం జరిగింది. మంత్రి హరీశ్‌రావు అధ్యక్షతన జరిగిన సమావేశంలో వ్యవసాయశాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి, దేవాదాయశాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి, మిషన్ భగీరథ వైస్ చైర్మన్ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్‌రెడ్డి, ఎంపీ బీబీపాటిల్, ఈఎన్‌సీ మురళీధర్, ఓఎస్డీ శ్రీధర్ దేశ్ పాండే పాల్గొన్నారు. ప్రాజెక్టులోకి భారీగా వరద నీరు వస్తుండటంతో ఆయకట్టు రైతులకు నీటిని విడుదల చేయాలని సమావేశంలో చర్చిస్తున్నారు.

ఎగువ ప్రాంతంలోని మహారాష్ర్టాలో, గోదావరి పరివాహిక ప్రాంతాలైన నిజామాబాద్, నిర్మల్ జిల్లాల్లో భారీ వర్షాలు పడటంతో ప్రాజెక్టులోకి రెండున్నర లక్షల క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరుతోంది. రాత్రి 89 వేల క్యూసెక్కులు ఉన్న వరద ఉదయం మూడు లక్షలకు పెరిగి ప్రస్తుతం రెండున్నర లక్షల క్యూసెక్కుల వద్ద కొనసాగుతుంది. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం 1091 అడుగులు కాగా ప్రస్తుతం ప్రాజెక్టులో 1078.70 అడుగులుగా ఉంది. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి నిలువ సామర్థ్యం 90.313 టీఎంసీలు కాగా ప్రస్తుతం 48.948 టీఎంసీలుగా ఉంది.

1012
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS