రేవంత్‌రెడ్డి బహిరంగ చర్చకు రావాలి: పల్లా

Thu,November 23, 2017 12:05 PM

Revanth reddy should come open discussion

హైదరాబాద్: కాంగ్రెస్ నేత రేవంత్‌రెడ్డి దమ్ముంటే బహిరంగ చర్చకు రావాలని మండలి విప్ పల్లా రాజేశ్వర్‌రెడ్డి సవాల్ విసిరారు. హైదరాబాద్ మాదక ద్రవ్యాల అడ్డాగా మారిందన్న రేవంత్‌రెడ్డి ఆరోపణలపై ఆయన స్పందించారు. టీఆర్‌ఎస్‌ఎల్పీ భవన్‌లో మీడియా ద్వారా మాట్లాడుతూ.. ఈ నెల 28 నుంచి హైదరాబాద్‌లో ప్రపంచ పారిశ్రామికవేత్తల సమావేశం జరుగుతుంది. ప్రధానితో పాటు ఇవాంక ట్రంప్ వస్తున్నరు. ఈ నేపథ్యంలో కొలువుల కొట్లాటను వాయిదా వేసుకోవాలని సూచించారు. విపక్షాలు అనవసర రాద్దాంతం చేస్తున్నాయని మండిపడ్డారు. సంబంధంలేని విషయాలపై రచ్చ చేస్తున్నట్లు చెప్పారు. హైదరాబాద్ నగరం డ్రగ్స్ జోన్‌లో లేదని నార్కోటిక్స్ విభాగం చెప్పిందన్నారు. కొత్త పబ్బులకు టీఆర్‌ఎస్ ప్రభుత్వం పర్మిషన్ ఇవ్వలేదని తెలిపారు. టీఆర్‌ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత పేకాట క్లబ్‌లు మూతపడ్డ విషయాన్ని గుర్తుచేశారు. హైదరాబాద్ నగరం డ్రగ్స్ ఫ్రీ సిటీగా మారిందని వెల్లడించారు. చంద్రబాబు వేసిన బొక్కలు తిని రేవంత్‌రెడ్డి కుక్కలా పనిచేసిండని పల్లా రాజేశ్వర్‌రెడ్డి పేర్కొన్నారు.

1336
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

country oven

Featured Articles

Health Articles