ఎమ్మెల్యే పదవికి రేవంత్ రెడ్డి రాజీనామా

Thu,September 6, 2018 12:55 PM

Revanth Reddy resigns to MLA Post today

హైదరాబాద్ : కొడంగల్ నియోజకవర్గం నుంచి శాసనసభకు ప్రాతినిధ్యం వహిస్తున్న రేవంత్‌రెడ్డి.. తన ఎమ్మెల్యే పదవికి ఇవాళ రాజీనామా చేశారు. రాజీనామా లేఖను స్పీకర్ ఫార్మాట్‌లో సమర్పించారు. తన రాజీనామా లేఖను స్పీకర్ మధుసూదనాచారికి ఇచ్చేందుకు ఇవాళ ఉదయం రేవంత్ రెడ్డి అసెంబ్లీకి చేరుకున్నారు. అయితే స్పీకర్ అక్కడ లేకపోవడంతో.. ఆయన పీఏకు రాజీనామా లేఖను అందజేశారు. గతేడాది అక్టోబర్ 27న టీడీపీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశానని రేవంత్ తెలిపారు. ఆ తర్వాత రాహుల్ గాంధీ సమక్షంలో రేవంత్ కాంగ్రెస్ పార్టీలో చేరిన సంగతి తెలిసిందే.

9621
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS