వ్యక్తిని ఢీకొట్టిన రేవంత్ రెడ్డి కారు..

Sun,March 4, 2018 05:19 PM

వనపర్తి: రేవంత్ రెడ్డి కారు ఢీకొని ఓ వ్యక్తి కాళ్లు విరిగిపోయిన ఘటన జిల్లాలోని మూసాపేట దగ్గర జరిగింది. వనపర్తిలో జరిగే సింహగర్జనకు రేవంత్ రెడ్డి కారులో వెళుతున్నారు. అయితే.. మూసాపేట వద్దకు కారు రాగానే... కారు డ్రైవర్ నిర్లక్ష్యంతో ఓ వ్యక్తిని ఢీకొట్టాడు. దీంతో ఆ వ్యక్తి రెండు కాళ్లు విరిగిపోయాయి. అతడు.. మూసాపేట మండలం తుంకిలిపూర్ గ్రామానికి చెందిన వ్యక్తి అని గుర్తించారు. ఈ యాక్సిడెంట్‌ను గమనించిన స్థానికులు అక్కడికి చేరుకొని రేవంత్ కారును ఆపి ధర్నా చేశారు. దీంతో నా కారునే ఆపుతారా అంటూ రేవంత్ కారు దిగి అక్కడి వారిని దూషించినట్లు సమాచారం. అయినప్పటికీ ఆ వ్యక్తిని ఆసుపత్రికి తరలించాలని వాళ్లు డిమాండ్ చేయడంతో వెనక్కి తగ్గిన రేవంత్.. వెళ్లి కారులో కూర్చున్నాడు. ఇంతలో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకోవడంతో రేవంత్ అక్కడి నుంచి వెళ్లిపోయాడు. గాయపడిన వ్యక్తిని అక్కడి స్థానికులే సమీపంలోని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. మిగితా వివరాలు తెలియాల్సి ఉంది.

7002
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles