ఐటీ విచారణకు రేవంత్‌రెడ్డి హాజరు

Wed,October 3, 2018 11:52 AM

revanth reddy attends IT inquiry

హైదరాబాద్: కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్‌రెడ్డి ఐటీ అధికారుల ఎదుట విచారణకు హాజరయ్యారు. బషీర్‌బాగ్‌లోని ఐటీ కార్యాలయంలో విచారణకు హాజరయ్యారు. రేవంత్ ఇంట్లో సోదాల సందర్భంగా స్వాధీనం చేసుకున్న పత్రాలతో పాటు, లాకర్లపై అదేవిధంగా ఓటుకు నోటు కేసు అంశాలపైనా ఐటీ అధికారులు ఆరా తీసే అవకాశం ఉంది. అధికారులు రేవంత్‌రెడ్డిని ప్రశ్నించనున్నారు. ఇప్పటికే ఐటీ అధికారుల ఎదుట సోమవారం విచారణకు హాజరైన ఉదయసింహ, సెబాస్టియన్ నేడు మరోమారు విచారణకు హాజరుకానున్నారు.

2245
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles