ఓటర్ల జాబితాలో అభ్యంతరాలను పరిష్కరిస్తాం

Fri,September 14, 2018 01:24 PM

Resolves objections in the electoral roll in Telangana says Rajat Kumar

హైదరాబాద్ : రాష్ట్రంలో ముందస్తు ఎన్నికల నేపథ్యంలో ఓటర్ల ముసాయిదా జాబితా సవరణ నేపథ్యంలో ఓటర్ల జాబితాలో ఉన్న అభ్యంతరాలను పరిష్కరిస్తామని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి రజత్ కుమార్ స్పష్టం చేశారు. ఇవాళ మధ్యాహ్నం రజత్ కుమార్ మీడియాతో మాట్లాడారు. ఓటర్ లిస్టులతో పోలింగ్ బూత్‌ల వారీగా విభజన జరుతుతుందన్నారు. ఈ నెల 15, 16వ తేదీల్లో గ్రామస్థాయిలో పోలింగ్ బూత్‌ల వారీగా ఓటర్ల జాబితాపై ఉన్న అభ్యంతరాలను స్వీకరించి పరిష్కరిస్తామని చెప్పారు. ఓటర్లను చైతన్య పర్చేందుకు తమ యంత్రాంగం చర్యలు చేపట్టిందని తెలిపారు. ప్రతి గ్రామంలోనూ ప్రజలను చైతన్య పరిచేలా ప్రత్యేక కార్యక్రమాలు కొనసాగుతున్నాయని పేర్కొన్నారు.

ఈవీఎంలపై అనుమానాలొద్దు
ఈవీఎంల పనితీరుపై ఎలాంటి అనుమానం వద్దు అని రజత్ కుమార్ స్పష్టం చేశారు. మన దేశంలో ఈవీఎంల పనితీరు చాలా పక్కాగా ఉందన్నారు. న్యాయస్థానాల్లో 37 కేసులు వేసినా ఈవీఎంలపై అనుకూలంగానే నిర్ణయం వచ్చిందని తెలిపారు. ఈ నెల 20లోగా కావాల్సినన్నీ ఈవీఎంలు రాష్ర్టానికి వస్తాయి. ఈవీఎం మిషన్లు రాగానే వాటిని రాజకీయ పార్టీల సమక్షంలో పరీక్షిస్తాం. ఈసారి కొత్తగా వీవీప్యాట్ మిషన్లు ఏర్పాటు చేస్తామని రజత్ కుమార్ చెప్పారు.

నగదు పంపిణీపై నిఘా
ముందస్తు ఎన్నికల నేపథ్యంలో ఆయా పార్టీల అభ్యర్థులు పంపిణీ చేసే నగదుపై నిఘా పెడుతామని రజత్ కుమార్ స్పష్టం చేశారు. అభ్యర్థుల ఎన్నికల ఖర్చును క్షుణ్ణంగా పరిశీలిస్తామన్నారు. సామాజిక మాధ్యమాల్లో ఎన్నికల ప్రచారంపై వచ్చే కథనాలపై ప్రత్యేక నిఘా ఉంచుతామన్నారు.

1654
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles