విక‌లాంగుల‌కు పెంచిన‌ రిజ‌ర్వేష‌న్‌ను వ‌ర్తింప‌చేయాలి: కవిత

Fri,June 15, 2018 07:46 PM

reservations should be implemented for disabled persons says MP Kavitha

సికింద్రాబాద్: దివ్యాంగులకు రైల్వే ఉద్యోగాల్లో 4 శాతం రిజ‌ర్వేష‌న్ క‌ల్పించాల‌ని నిజామాబాద్ ఎంపీ క‌ల్వ‌కుంట్ల క‌విత అన్నారు. శుక్ర‌వారం సికింద్రాబాద్ రైల్వే స్టేష‌న్‌లో కాచిగూడ-క‌రీంన‌గ‌ర్‌ ల మ‌ధ్య న‌డిచే పాసింజ‌ర్ రైలును కేంద్ర రైల్వే మంత్రి పీయూష్ గోయ‌ల్ ప్రారంభించారు. ఈ సంద‌ర్భంగా జ‌రిగిన స‌భ‌లో పాల్గొన్న ఎంపీ మాట్లాడుతూ.. రైల్వే ఉద్యోగాల్లో ప్ర‌స్తుతమున్న 3 శాతం రిజ‌ర్వేష‌న్ల‌ను డిజెబులిటీ రిజ‌ర్వేష‌న్‌ బిల్లు ద్వారా పార్ల‌మెంట్ 4 శాతంకు పెంచింద‌ని తెలిపారు. కావునా ఇక ముందు జ‌రిపే రైల్వే నియామ‌కాల్లో దివ్యాంగులకు పెంచిన‌ రిజ‌ర్వేష‌న్‌ను వ‌ర్తింప‌చేయాల‌ని కోరారు.

నిజామాబాద్ రైల్వే స్టేషన్ A గ్రేడ్ పొందినా ఆ మేరకు సదుపాయాల కల్పన జరగలేదన్నారు. వ‌స‌తులు కల్పించేలా అధికారులను అదేశించాల‌న్నారు. కాచిగూడ-నిజామాబాద్ పాసింజర్ రైలును కరీంనగర్ వరకు పొడిగించిన రైల్వే మంత్రి పీయూష్ గోయల్ కు ఎంపి క‌విత‌ కృతజ్ఞతలు తెలిపారు.ఈ రైలు వ‌ల్ల నిజామాబాద్ నుండి కరీంనగర్ వరకు గ్రామీణ ప్రాంత వాసులకు రైలు ప్రయాణ సౌకర్యం ఏర్పడిందన్నారు. గ్రామీణ ప్రాంత రైల్వే స్టేషన్లలో వైఫై, ఎల్ఇడి సౌకర్యం కల్పించడం అభినందనీయమ‌న్నారు. తెలంగాణలోని అన్ని జిల్లాల నుండి సికింద్రాబాద్ కు రైలు కనెక్టివిటీ కల్పించాలని ఎంపి క‌విత రైల్వే మంత్రిని కోరారు.

2023
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles