జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్లు ఉండాలి: కేసీఆర్

Thu,January 18, 2018 04:43 PM

Reservations must be based on population says KCR

హైదరాబాద్: 50 శాతం రిజర్వేషన్లు సరిపోవని.. జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్లు అమలు చేయాలని.. దామాషా ప్రకారం రిజర్వేషన్లు ఉండాల్సిందేనని రాష్ట్ర సీఎం కేసీఆర్ అన్నారు. ఇండియాటుడే సౌత్ కాంక్లేవ్ 2018 కార్యక్రమంలో పాల్గొన్న సీఎం కేసీఆర్ ప్రముఖ జర్నలిస్ట్ రాజ్‌దీప్ సర్దేశాయ్ అడిగిన పలు అంశాలపై తన అభిప్రాయాన్ని వెల్లడించారు. తెలంగాణలో 90 శాతం జనాభా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు ఉన్నారు. ఇటువంటి పరిస్థితుల్లో ప్రతి రాష్ర్టానికి ఆయా పరిస్థితులకనుగుణంగా రిజర్వేషన్లు ఇచ్చే అవకాశమివ్వాలన్నారు.
రాష్ర్టాలు ఎదిగేందుకు అవకాశం ఇవ్వాలి..
భారతదేశమంటే రాష్ర్టాల సమాహారమే. మనది సహకార సమైక్య వ్యవస్థ అన్న ప్రధాని మాటలను సమర్థిస్తున్నట్లు సీఎం తెలిపారు. రాష్ర్టాల సంపదే జాతి సంపద. కాబట్టి రాష్ర్టాలు మరింత ఎదిగేందుకు కేంద్రం అవకాశం ఇవ్వాలని.. వాటిని ఇబ్బంది పెట్టకూడదని పేర్కొన్నారు. తనకు ఢిల్లీ రాజకీయాలపై ఆసక్తి లేదని.. తెలంగాణ రాష్ట్రమే ముఖ్యమని సీఎం అన్నారు.

1571
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles