మెట్రో స్టేషన్లలో అద్దె బైకులు

Sun,October 13, 2019 08:37 AM

హైదరాబాద్ : మీరు మెట్రో రైలు ప్రయాణికులా.? మీకు మొబైల్ స్మార్ట్ ఫోన్, డ్రైవింగ్ లైసెన్ ఉందా.? ఇక మీదట మెట్రో రైలు దిగి.. మీ గమ్యస్థానాలకు వెళ్లేందుకు ఏ ఆటో కోసమో.. క్యాబ్ కోసమో లేదా ఆర్టీసీ బస్సు కోసమో వేచిచూడాల్సిన అసరం లేదు. ఎంచక్కా బైకు రైడ్ చేసుకుంటూ వెళ్లో చ్చు. బెంగళూరు మెట్రో రైలు తరహాలో మన హైదరాబాద్ నగరంలో బౌన్స్ అద్దె బైకు సేవలు అందుబాటులోకి వచ్చాయి. శుక్రవారం నగర ట్రాఫిక్ పోలీస్ ఆదనపు కమిషనర్ అనిల్‌కుమార్ బౌన్స్ అద్దె బైకు సేవలను ప్రారంభించారు. ముందుగా సికింద్రాబాద్ ప్యారడైజ్ మెట్రో స్టేషన్లలో ప్రారంభమైన అద్దె బైకుల సేవలను హైటెక్ సిటీ, జూబ్లీ చెక్‌పోస్టు, సీబీఎస్ ఇలా దశలవారీగా అన్ని మెట్రో స్టేషన్లలో అందుబాటులోకి తీసుకొచ్చేందుకు చర్యలు తీసుకుంటున్నారు.అయితే గోవాలోని పనాజీ వంటి నగరాల్లో అద్దె బైకులు అందుబాటులో ఉన్నా.. వాటిని అద్దెకు తీసుకున్న వ్యక్తి తిరిగి వాటిని అద్దె తీసుకున్న ప్రదేశంలో అప్పగించాల్సి ఉంటుంది. కానీ బౌన్స్ సంస్థ ఆ లోటు ను భర్త్తీ చేసింది. నగరంలోనే ఎక్కడైనా బైకును అద్దెకు తీసుకొని మన గమ్యానికి చేరుకున్నాక, పబ్లిక్ పార్కిం గ్ ప్రదేశంలో బైకును వదిలేసి వెళ్లోచ్చు. తిరిగి ఆ బైకు ను అద్దెకు తీసుకున్న ప్రదేశంలో అప్పగించాల్సిన పనిలేదు. తాళం వేయాల్సిన పనికూడా లేదు. మొబైల్ ఉన్న యాప్ ద్వారా మన ట్రిప్ ముగిసినట్లు తెలియజేస్తే చాలు. బౌన్స్ కంపెనీ ప్రతినిధులే ఆన్‌లైన్‌లో బైకును లాక్ చేస్తారు. ఇక ఆ ప్రదేశంలో మరొకరు అదే బైకును తీసుకొని తమ రైడ్‌ను ప్రారంభించవచ్చు. ఇలా నగరంలో ఎక్కడి నుంచి ఎక్కడికైనా వెళ్లవచ్చు.

బౌన్స్ అద్దె బైకుల సేవలు ఇలా..


టు వీలర్ డ్రైవింగ్ లైసెన్సు కలిగి ఉండి.. మొబైల్ స్మార్ట్ ఫోన్ వినియోగించే ప్రతిఒక్కరూ బౌన్స్ అద్దె బైకుల సేవలను వినియోగించుకోవచ్చు. ముందుగా బౌన్స్ సేవలు వినియోగించుకునే వారు యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇన్‌వెర్స్ టెక్నాలజీ సహాయంతో బౌన్స్ సంస్థ టీవీఎస్ జెస్ట్, టీవీఎస్ పెప్ మోటార్ బైకులను నడుపుతోంది. త్వరలోనే ఎలక్ట్రిక్ వాహనాలు అందుబాటులోకి రానున్నాయి. వాహనాలన్నీ కీ లెస్‌వే.. ఏ వాహనానికి తాళం ఉండవు. హెల్మెట్‌లతోసహా జీపీఎస్‌తో అనుసంధానమై ఉంటాయి. కంపెనీ తన మొబైల్‌లో ఉన్న యాప్ ఆధారంగా ప్రయాణికులు ఏ ప్రదేశంలో ప్రయాణిస్తున్నారో.. నిరంతరం తెలుసుకోవచ్చు. ఒకవేళ బైకుకు ఏదైనా ప్రమాదం జరిగితే క్రాష్ అలర్ట్ పేరిట కంపెనీకి సమాచారం వస్తోంది. వెంటనే కంపెనీ ప్రమాద సంఘటన ను స్థానిక పోలీస్, 108 వాహనాలకు తెలియజేస్తుం ది. తమ రికవరీ వాహనం ద్వారా ప్రమాదానికి గురైన వాహనాన్ని అక్కడి నుంచి తరలిస్తోంది. అదేవిధంగా తమ మొబైల్‌లో ఉన్న యాప్ ఆధారంగా ప్రయాణికులు తమకు సమీపంలో ఏవైనా బైకులు ఉన్నాయో లేదో చెక్ చేసుకుని, అవసరమైతే బుక్ చేసుకోవచ్చు. అక్కడి నుంచి గమ్యస్థానానికి చేరుకున్నాక సమీపంలోని పబ్లిక్ పార్కింగ్ ప్రదేశంలో బైక్‌ను పార్క్ చేసి తమ మొబైల్ యాప్ ద్వారా ట్రిప్ ఎండ్ అని వెళ్లిపోవచ్చు. అద్దె బైకులకు పూయల్ సెన్సార్, స్పీడ్ లిమిట్(కిలోమీటర్‌కు 60 చొప్పున)అమర్చారు. ప్రస్తుతానికి కిలోమీటరుకు రెండు రూపాయలు, బైకును వినియోగించిన సమయానికి నిమిషానికి రూ.1.5 చొప్పు న చార్జీ చేస్తున్నారు.

బెంగళూరులో సక్సెస్..


బెంగళూరు మెట్రో రైలు స్టేషన్లలో నాలుగేళ్ల క్రితం బౌన్స్ అద్దె బైకులను ప్రారంభించి విజయవంతమైం ది. బ్యాపనహళ్లి మెట్రో స్టేషన్ వద్ద వివేకానంద హల్కే రి అనే వ్యక్తి 20 బైకులతో ప్రారంభించిన బౌన్స్ సంస్థ, నేడు నగరవ్యాప్తంగా 8వేల బైకులు రోజూ 80వేల నుంచి లక్ష బుకింగ్స్‌తో ప్రయాణికులను గమ్యస్థానాలకు చేర్చుతున్నాయి. దీంతో హైదారాబాద్‌లో మెట్రో ప్రయాణాన్ని మరింత సరళతరం చేసేందుకు వరల్డ్ రిసోర్స్ ఇనిస్టిట్యూట్(డబ్ల్యూఆర్‌ఐ) ఆధ్వర్యంలో ఇటివల నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో బౌన్స్‌ను ఎంపిక చేసినట్లు హెచ్‌ఎంఆర్‌ఎల్ చీఫ్ ఎలక్ట్రికల్ ఇంజి నీరు డీవీఎస్ రాజు తెలిపారు. మెట్రో రైలు ప్రయాణికులు కార్యాలయాలకు, నివాసం, వ్యాపార సంస్థలకు వెళ్లేందుకు ఈ అద్దె బైకు సేవలు ఎంతగానో ఉపయోగపడుతాయని, నగరవాసులకు సౌకర్యవంతంగా ఉం టుందని భావించి అద్దె బైకు సేవలను ప్రారంభించిన ట్లు వెల్లడించారు. బెంగూళురులో బౌన్స్ సేవలను వినియోగిస్తున్న వారిలో 40-50 శాతం మెట్రో రైలు ప్రయాణికులేనన్నారు. వీరిలో బైకులను అద్దెకు తీసుకుంటున్న వారిలో 30శాతం మహిళలు ఉంటున్నారని బౌన్స్ డైరెక్టర్ ఆయూషి జైన్ వెల్లడించారు.

1658
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles