ప్రాంతీయ పార్టీల నాయకుడే ప్రధాని: మంత్రి ఎర్రబెల్లి

Tue,March 26, 2019 11:42 AM

regional parties leader is going to be prime minister says minister errabelly dayakar rao

వరంగల్‌: కేంద్రంలో బీజేపీ, కాంగ్రెస్‌ వచ్చే పరిస్థితి లేదని.. ప్రాంతీయ పార్టీలు సూచించిన నాయకుడే ప్రధాని అవుతారని మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు అన్నారు. వరంగల్‌లో ఏప్రిల్‌ 2న జరిగే సీఎం బహిరంగ సభా ఏర్పాట్లను మంత్రి నేడు పరిశీలించారు. ఆజంజాహి మిల్లు మైదానంలో జరిగే టీఆర్‌ఎస్‌ సభ ఏర్పాట్లను స్థానిక నాయకులు, అధికారులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. బహిరంగ సభకు రెండు లక్షల మంది వచ్చేలా ఏర్పాట్లు చేస్తునట్లు తెలిపారు. గతంలో ఇక్కడి సభలో పాల్గొన్న పీవీ నరసింహారావు ప్రధాని అయ్యారన్నారు. ఈ సెంటిమెంట్‌ కొనసాగుతుందని మంత్రి పేర్కొన్నారు.

830
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles