మళ్లీ రికార్డులను తిరగరాసి..

Fri,May 31, 2019 06:30 AM

Records recreates in current usage in hyderabad


హైదరాబాద్‌ : గ్రేటర్‌ హైదరాబాద్‌ పరిధిలో అధిక ఉష్ణోగ్రతల వల్ల విద్యుత్‌ వినియోగం రికార్డులను తిరగరాస్తున్నది. గ్రేటర్‌ చరిత్రలోనే 28న 71.05 మిలియన్‌ యూనిట్లుగా నమోదై రికార్డు సృష్టించింది. తాజాగా 29న ఏకంగా 74 మిలియన్‌ యూనిట్లు నమోదవ్వడంతో రికార్డులను తిరగరాసినట్టయింది.

ఒక్క రోజు వ్యవధిలోనే 3.5 మిలియన్‌ యూనిట్లకు పైగా విద్యుత్‌ వినియోగం నమోదు కావడం గమనార్హం. అదే ఈనెల 24తో పోల్చుకుంటే.. 6 మిలియన్‌ యూనిట్లకు పైగా పెరిగిందంటే పరిస్థితి అర్థమవుతున్నది.మరో వారం రోజులకు పైగా ఇదే స్థాయిలో విద్యుత్‌ వినియోగం ఉండే అవకాశం ఉండనున్నట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. కాగా, గ్రేటర్‌ వ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లో బుధవారం ఉదయం నుంచి సాయంత్రం 5.30గంటల వరకు గరిష్ఠ ఉష్ణోగ్రత 42 డిగ్రీల సెల్సియస్‌గా నమోదైంది. కనిష్ఠ ఉష్ణోగ్రత 30.6 డిగ్రీల సెల్సియస్‌గా నమోదైనట్లు వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు.

7718
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles