తొలిసారిగా ‘రెరా’లో ఫిర్యాదు...

Sat,January 19, 2019 07:24 AM

real estate regulatory authority complaints in hyderabad

హైదరాబాద్ : 2017 జనవరి 1 తర్వాత 500చ.గలు పైబడిన స్థలంలో, 8 ప్లాట్లకు మించి నిర్మించే రియల్ ఎస్టేట్ ప్రాజెక్టులు రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అథారిటీ కార్యాలయంలో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. అలా చేసుకోని ప్రతి ప్రాజెక్టు విక్రయాలు చేపట్టడం, ప్రచారం చేయడం, ప్రకటనలు చేయరాదు. అలా చేసినట్లయితే ఆ ప్రాజెక్టు మొత్తం వ్యయంలో 10 శాతం జరిమానాను విధించడం, కేసులు నమోదు చేసేలా చట్టం అమలులో ఉంది. దీనిని దృష్టిలో ఉంచుకుని హెచ్‌ఎండీఏ తమ పరిధిలోని అనుమతులు తీసుకోకుండా వెలిసిన లే అవుట్లు, భవన నిర్మాణాలను నియంత్రించడంలో భాగంగా తాము గుర్తించిన వాటి వివరాలను రెరాకు అందించాలి.

కొందరు రియల్టర్లు హెచ్‌ఎండీఏ అనుమతి లేకుండానే అథారిటీకి కేవలం దరఖాస్తు చేసుకుని తద్వారా వచ్చిన ఫైల్ నంబరు ఆధారంగా హెచ్‌ఎండీఏ లోగో(బ్రోచర్)ను వినియోగిస్తున్నారు. విస్తృతంగా ప్రచారం చేసుకుంటూ అమాయకులే లక్ష్యంగా ప్లాట్ల విక్రయాలు జరుపుతున్నారు. ఇలాంటివి రెరా చట్టం ప్రకారం నిషేధం..శిక్షార్హం. ఈ మేరకు తుర్కపల్లిలోని 53 ఎకరాల్లో నిబంధనలు ఉల్లంఘించిన సంస్థపై తొలిసారిగా ‘రెరా’లో ఫిర్యాదు చేశారు.

1418
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles