4, 5 తేదీల్లో ఆర్బీఐ ఉద్యోగుల మూకుమ్మడి సెలవు

Wed,August 29, 2018 07:20 AM

RBI employees mass holiday on September 4 and 5

హైదరాబాద్: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా బ్యాంక్ ఉద్యోగులకు పెన్షన్ అప్‌డేషన్ కల్పించడంలో కేంద్రం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని యునైటెడ్ ఫోరం ఆఫ్ రిజర్వ్‌బ్యాంక్ ఆఫీసర్స్ అసోసియేషన్ ఆరోపించింది. ఆర్బీఐలో పనిచేస్తున్న ఉద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యలను పట్టించుకోవడంలో కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్య ధోరణిరి వ్యతిరేకంగా, డిమాండ్ల సాధనకై వచ్చే నెల 4, 5 తేదీల్లో ఉద్యోగులు, సిబ్బంది మూకుమ్మడిగా సెలవు పెడుతున్నారని వారు తెలిపారు. ఈ మేరకు మంగళవారం బషీర్‌బాగ్ ప్రెస్ క్లబ్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎంఎస్ హరిశంకర్(ఆర్‌బీఐఓఏ), సుధాకర్ రావు దేశాయ్(ఏఐఆర్‌బీఓఏ), ఎంబీ హరీష్ బాబు(ఆర్‌బీఐఈఏ), జగదీశ్(ఆర్‌బీడబ్ల్యూయూ), వై. శ్రీరామ శర్మ(ఆర్‌బీఆర్‌ఏ)లు మాట్లాడుతూ.. దేశవ్యాప్తంగా 14,500 మంది సిబ్బంది సామూహికంగా సెలవు పెడుతుండటంతో రెండు రోజుల పాటు ఆర్బీఐ లావాదేవీలు పూర్తిగా స్తంభించిపోతాయని వెల్లడించారు. ఉద్యోగుల న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని పలుమార్లు కేంద్రానికి విజ్ఞప్తి చేసినా పట్టించుకోలేదని వారు ఆరోపించారు. వేతన ఒప్పందాల ద్వారా ఉద్యోగ వేతనాలు పెరిగినప్పుడు దానికి అనుగుణంగా పెన్షన్ దారుల బేసిక్ పెన్షన్ మారడంలేదని దీని వలన ఉద్యోగులు, విశ్రాంత సిబ్బంది ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని వారు తెలిపారు.

1424
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles