మూడేండ్లలో అద్దాల్లా రోడ్లు!

Tue,February 12, 2019 08:10 AM

R&B developed roads in state wide in three years

హైదరాబాద్: రాష్ట్రంలోని రహదారులను అభివృద్ధి చేసేందుకు రోడ్లు, భవనాలశాఖ ఉన్నతాధికారులు చర్యలు ప్రారంభించారు. ఇటీవల నిర్వహించిన సమీక్షలో సీఎం కేసీఆర్ మాట్లాడుతూ రూ.3 వేల కోట్లు ఇస్తామని, మూడేండ్లలోగా రాష్ట్రంలోని రోడ్లన్నీ అద్దంలా మెరువాలని లక్ష్యంగా నిర్ణయించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో అధికారులు అప్రమత్తమయ్యారు. రోడ్లన్నింటినీ మరమ్మతులు చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా రోడ్ల పరిస్థితిపై నివేదికలు రూపొందించి ఈ నెల 15లోగా ఇవ్వాలని జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. ఎన్ని రోడ్లు ఉన్నాయి? ఏ స్థితిలో ఉన్నాయి? పంచాయతీలకు కొత్త రోడ్లు ఎన్ని కావాలి? వంటి సమాచారాన్ని తెప్పిస్తున్నారు. నివేదిక రాగానే సమావేశమై మరమ్మతులు చేయడానికి కార్యాచరణ ప్రణాళిక రూపొందించనున్నారు. రాష్ట్రంలో మొత్తం 27,521 కిలోమీటర్ల రోడ్లు ఉన్నాయి. ఇందులో దాదాపు ఐదు వేల కిలోమీటర్ల వరకు జాతీయ రహదారులు. వీటన్నింటినీ రిపేర్ చేయడంతోపాటు బీటీరోడ్డు సౌకర్యం లేని 863 పంచాయతీలకు కొత్తగా రోడ్లు వేయనున్నారు. మండల కేంద్రాలకు, ముఖ్యమైన మార్కెట్ సెంటర్లకు రెండులేన్ల కనెక్టివిటీ ఏర్పాటుచేయాలని నిర్ణయించారు. అసంపూర్తిగా ఉన్న బ్రిడ్జీలు, ఇతర పనులను పూర్తిచేస్తారు. రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు విడుదల చేసే నిధులు, జాతీయ రహదారుల సంస్థ ఇచ్చే గ్రాంట్లతో పనులు చేయాలని నిర్ణయించారు.

1538
Follow us on : Facebook | Twitter
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles