వరంగల్ రంగ లీల మైదానంలో ఘనంగా రావణ వధ

Fri,October 19, 2018 07:09 PM

Ravan effigy burnt in warangal rangaleela ground

రావణ ప్రతిమకు నిప్పంటించిన మేయర్ నరేందర్
వరంగల్: అండర్‌ రైల్వేగేట్ ప్రాంతంలోని ఉర్సు రంగ లీల మైదానంలో రావణవధ కనుల పండుగలా నిర్వహించారు. గురువారం విజయదశమిని పురస్కరించుకుని ఏర్పాటు చేసిన భారీ రావణ ప్రతిమ, వివిధ రకాల బాణాసంచా ప్రజలను ఆకట్టుకున్నాయి. ఈ సందర్భంగా ఉత్సవ సమితి అధ్యక్షుడు నాగపూరి వెంకటస్వామి అధ్యక్షతన ఏర్పాటు చేసిన సమావేశంలో వరంగల్ మహానగరపాలక సంస్థ మేయర్ నన్నపునేని నరేందర్ మాట్లాడుతూ.. చెడుపై మంచి విజయం సాధించడమే విజయదశమి అన్నారు.

ఉద్యమ స్ఫూర్తితో ప్రాంత అభివృద్ధికి కృషి చేసుకోవాలన్నారు. ఇక్కడే పుట్టిన బిడ్డగా అన్ని విధాలా అండగా ఉంటానన్నారు. అనంతరం రావణ ప్రతిమకు నిప్పంటించారు. ఆకాశంలో ఎగిరిన తారాజువ్వల వెలుతురుతో ప్రాంతమంతా మిరమిట్లు గొలిపింది. ఈసారి ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన బాణసంచాలు ప్రజలను ఆకట్టుకున్నాయి. కార్యక్రమంలో రాజ్యసభ సభ్యుడు డాక్టర్ బండా ప్రకాశ్, ఎంపీలు పసునూరి దయాకర్, సీతారాం నాయక్, తెలంగాణ రాష్ట్ర మహిళా ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్‌పర్సన్ గుండు సుధారాణి, కుడా చైర్మన్ మర్రి యాదవరెడ్డి, తెలంగాణ మైనార్టీ కమిషన్ సభ్యుడు బొమ్మల్ల కట్టయ్య, కార్పొరేటర్లు మేడిది రజిత, మరుపల్ల భాగ్యలక్ష్మి, కత్తెరశాల వేణుగోపాల్, ఉత్సవ సమితి సభ్యులు పాల్గొన్నారు.

2698
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles