360 బస్తాల రేషన్ బియ్యం పట్టివేత..ఆరుగురిపై కేసు

Mon,April 15, 2019 09:39 PM

ration rice bags seized in manthani


కరీంనగర్ : కొంత కాలంగా గుట్టుచప్పుడు కాకుండా పక్కదారి పడుతున్న రేషన్‌ బియ్యం(పీడీఎస్‌ రైస్‌)పై పెద్దపల్లి జిల్లా మంథని పోలీసులు నిఘా పెట్టారు. ఆదివారం అర్ధరాత్రి పోలీసులు చేపట్టిన తనిఖీల్లో రెండు చోట్ల అక్రమంగా రేషన్ బియ్యాన్ని తరలించేందుకు సిద్ధంగా ఉంచిన వ్యాన్లను గుర్తించారు. రెండు వాహనాల్లో 360 బస్తాల రేషన్ బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. అక్రమ వ్యాపారం చేస్తున్న ఆరుగురు వ్యక్తులపై కేసు నమోదు చేశారు. మంథని మండలం ఎక్లాస్‌పూర్‌లో ఆదివారం రాత్రి 2గంటల సమయంలో మంథని సీఐ ఆకునూరి మహేందర్‌, ఎస్‌ఐ ఆర్కుటి మహేందర్‌ ఆధ్వర్యంలో పోలీసులు పెట్రోలింగ్‌ నిర్వహిస్తుండగా, టీఎస్‌ 04 యూఏ 5688అనే ఐచర్‌ వాహనాన్ని తనిఖీ చేయగా అందులో రేషన్‌ బియ్యం ఉన్నట్లు గుర్తించామని గోదావరిఖని ఏసీపీ ఉమేందర్‌ తెలిపారు.

1908
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles