ప్రభుత్వ జనరల్ దవాఖానలో అరుదైన ఆపరేషన్

Thu,April 11, 2019 03:15 PM

rare operation in government general hospital mahabubnagar

మహబూబ్‌నగర్ : ప్రభుత్వ జనరల్ దవాఖానలో అరుదైన వెన్నుముక శస్త్రచికిత్సను విజయవంతంగా చేసినట్లు దవాఖాన సూపరిటెండెంట్, ప్రముఖ ఆర్థోపెడిక్ వైద్యనిపుణుడు డాక్టర్ రాంకిషన్ తెలిపారు. శస్త్రచికిత్స ఆనంతరం వివరాలు వెల్లడించారు. మహబూబ్‌నగర్ మండలంలోని జైనల్లీపూర్, తువ్వగడ్డతండాకు చెందిన ఆర్. దేవేందర్ అనే యువకుడు ఈనెల 1న తీవ్ర నడుము నొప్పితో బాధపడుతూ జనరల్ దవాఖాన వైద్యులను సంప్రదించారు. పరీక్షించిన ఆర్థోపెడిక్ వైద్యులు ఎల్4, ఎల్5 డిస్క్ ప్రొలాప్స్ అనే అరుదైన వెన్నెముక వ్యాధి ఉందని గుర్తించారు.

దీనికి సంబంధించిన లామినాటమి, డిస్కెక్షమి అనే ఆపరేషన్ చేశారు. శస్త్రచికిత్స విజయంతంగా ముగియడంతో ప్రస్తుతం ఆ రోగి కోలుకొని నడుస్తున్నందున త్వరగా డిస్చార్జ్ చేశారు. ఈ విషయమై రోగి బంధువులు స్పందిస్తూ చాలాకాలంగా దేవేందర్ ఈ నొప్పితో బాధపడుతున్నాడని, ఎన్ని ప్రైవేట్ దవాఖానలకు తిరిగిన ఆపరేషన్ చేయలేక హైదరాబాద్‌కు రేఫర్ చేశారు. ఈ ఆపరేషన్‌కు సుమారు లక్ష రూపాయాలు ఖర్చు అయ్యేదనీ, ప్రభుత్వ దవాఖానలో ఉచితంగా నిర్వహించారని ఆనందం వ్యక్తం చేశారు.

ఇలాంటి అత్యాధునిక వైద్యసేవలను రోగులకు ఉచితంగా జనరల్ దవాఖానలో అందిస్తున్నామని, ప్రజలు వినియోగించుకోవాలని దవాఖాన సూపరింటెండెంట్ డా.రాంకిషన్ కోరారు. ఈ ఆపరేషన్‌ను సూపరింటెండెంట్ డా. రాంకిషన్, హెచ్‌వోడీ ఆఫ్ ఆర్థోపేడిక్ డా. నర్సింహరావు, ఆసోసియేట్ డా. అంకిత్, డా. మీర్జా, ఓటి హెడ్‌నర్సు ఖమృనిస్స, విజయలక్ష్మీ నిర్వహించారు.

1250
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles