ఇద్దరు బాలికలపై అత్యాచారం...

Sun,November 17, 2019 11:17 AM

విశాఖపట్నం: జిల్లా కేంద్రంలోని గోపాలపట్నం ప్రాంతంలో దారుణ సంఘటన చోటు చేసుకుంది. ఇద్దరు బాలికలపై అత్యాచారం జరిగింది. అరవింద్ అనే నిందితుడు బాలికలను ఎత్తుకెళ్లి అత్యాచారం చేశాడు. చాక్లెట్లు, ఐస్‌క్రీమ్‌లతో నిందితుడు బాలికలను ట్రాప్ చేశాడు. విషయం తెలుసుకున్న బాలికల తల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడిని అరెస్టు చేశారు. కేసు వివరాల్లోకి వెళితే... నిందితుడు అరవింద్ కారు డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. అతడి భార్య బ్యూటీ పార్లర్ నిర్వహిస్తోంది. ఆమె వద్ద పనిచేస్తున్న ఓ మహిళకు ఇద్దరు కూతుర్లు ఉన్నారు. ఆమె భర్త చనిపోవడంతో ఆ కుటుంబానికి అరవింద్ ఏ సహాయం కావాలన్నా చేసేవాడు. దీంతో బాలికలు అతడిని బాబాయ్ అని పిలిచేవారు.


ఆ కుటుంబానికి ఏ ఆసరా లేకపోవడాన్ని అలుసుగా తీసుకున్న అరవింద్ బాలికలపై కన్నేశాడు. పెద్ద అమ్మాయి(15)తో చనువుగా ఉంటూ కావాల్సిన వస్తువులు కొనిచ్చి లోబర్చుకున్నాడు. కొద్ది రోజుల క్రితం ఇద్దరు బాలికలను తీసుకుని నగరం దాటాడు. వివిధ ప్రాంతాలకు తీసుకెళ్లి అత్యాచారం చేశాడు. దీంతో కిడ్నాప్ కేసు నమోదు చేసిన పోలీసులు అరవింద్ చెరనుంచి వారిని రక్షించి తల్లికి అప్పగించారు. ఇంటికి వెళ్లిన బాలికలు జరిగిన విషయం తల్లికి చెప్పడంతో పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. వైద్య పరీక్షల్లో అత్యాచారం జరిగినట్లు తేలడంతో నిందితుడిపై పోక్స్ చట్టంతో పాటు, కిడ్నాప్ కేసు నమోదు చేసి అరెస్టు చేశారు.

3213
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles