ముస్లిములకు రంజాన్‌ కానుకల పంపిణీ షురూ

Tue,May 28, 2019 10:32 PM

ramzan gifts distribution started today


ఎదులాపురం: ఆదిలాబాద్‌ జిల్లా వ్యాప్తంగా ఇవాళ రంజాన్‌ గిఫ్ట్‌ ప్యాకుల పంపిణీని ప్రారంభించారు. పట్టణంలోని శాంతినగర్‌లో గల మజీతే హసనీయా, బంగారుగూడ, తాటిగూడ మసీదులో ముస్లిములకు జిల్లా మైనారిటీ సంక్షేమ శాఖ అధికారిణి కృష్ణవేణి గిఫ్ట్‌ ప్యాకులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూజజ ఆదిలాబాద్‌ నియోజకవర్గానికి 3వేలు, బోథ్‌ నియోజకవర్గానికి 1500 గిఫ్ట్‌ ప్యాక్‌లు వచ్చాయన్నారు. మజీద్‌ కమిటీల నిర్వాహకులు రేషన్‌ కార్డు ఉన్న నిరుపేద ముస్లిం కుటుంబాలను ఎంపిక చేసి టోకెన్లు అందించారన్నారు. టోకెన్ల ప్రకారమే వారికి గిప్టు ప్యాక్‌లను పంపిణీ చేస్తున్నామన్నారు. గిఫ్టు ప్యాకెట్ల పంపిణీ పారదర్శకంగా కొనసాగుతుందన్నారు.

2248
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles