రాంప్రసాద్ హత్య కేసులో నిందితుడికి పోలీసు కస్టడీ

Fri,July 19, 2019 06:45 PM

Ramprasad murder case accused  in Police custody to three days

హైదరాబాద్: పంజాగుట్టలో జరిగిన రాంప్రసాద్ హత్య కేసులో ప్రధాన నిందితుడు కొగంటి సత్యంకు మూడు రోజుల పోలీసు కస్టడీ విధించారు. కేసు దర్యాప్తు కోసం పంజాగుట్ట పోలీసులు వారం రోజుల కస్టడీ కోరుతూ పిటిషన్ దాఖలు చేశారు. పిటిషన్ విచారించిన నాంపల్లి కోర్టు నిందితుడిని విచారించేందుకు పోలీసులకు మూడు రోజుల అనుమతి మంజూరు చేసింది. రేపటి నుంచి మూడు రోజుల పాటు కొగంటి సత్యంను పోలీసులు విచారించనున్నారు.

559
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles