సిద్దిపేటలో రంజాన్ కానుకల పంపిణీ

Tue,May 28, 2019 03:34 PM

ramadan kanukalu distributes in Siddipet

సిద్దిపేట: మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్‌రావు సిద్దిపేటలో ముస్లింలకు నేడు రంజాన్ కానుకలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో హరీశ్‌రావు పాల్గొని మాట్లాడుతూ.. రాష్ట్రంలో మూడు లక్షల పేద ముస్లింలకు సీఎం రంజాన్ కానుకలు పంపిణీ చేస్తున్నారన్నారు. ఈ నెల 31న ప్రభుత్వ ఇఫ్తార్ విందును ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. పండగ రోజున అందరూ కొత్త దుస్తులు ధరించాలనేది సీఎం కేసీఆర్ ఆశయమన్నారు. మైనార్టీల కోసం ప్రభుత్వం 300 ఇంగ్లీష్ మీడియం రెసిడెన్షియల్ పాఠశాలలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. త్వరలోనే పేదలకు రెండు పడకగదుల ఇళ్లు, పెంచిన పింఛన్లు అందించనున్నట్లు వెల్లడించారు. సిద్దిపేటను స్వచ్ఛ, హరిత పట్టణంగా మార్చేందుకు అందరూ కృషి చేయాలని హరీశ్‌రావు ఈ సందర్భంగా పేర్కొన్నారు.


1278
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles