తెలంగాణలో కొత్త పీడీయాక్ట్ చట్టం

Mon,October 8, 2018 06:37 AM

ram nath kovind signed New PD Act in Telangana

హైదరాబాద్ : పీడీయాక్ట్ చట్టానికి పలుసవరణలు చేస్తూ రాష్ట్రప్రభుత్వం రూపొందించిన బిల్లును రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ఆమోదించినట్టు తెలిసింది. కేంద్ర హోంశాఖవర్గాల సమాచారం ప్రకారం.. తెలంగాణ ప్రివెన్షన్ ఆఫ్ డేంజరస్ యాక్టివిటీస్ ఆఫ్ బూట్‌లెగ్గర్స్, డెకాయిట్స్, డ్రగ్ ఆఫెండర్స్, ఇమ్మోరల్ ట్రాఫిక్ అఫెండర్స్ అండ్ ల్యాండ్ గ్రాబర్స్ సవరణ బిల్లు 2017కు రాష్ట్రపతి సమ్మతి తెలియజేసినట్టు సమాచారం. లైంగిక వేధింపులకు పాల్పడేవారిపై, పేలుడు పదార్థాలను తయారుచేసే నేరస్థులపై, ఆయుధాల స్మగ్లింగ్, సైబర్, ఆర్థికనేరాలు, విత్తనాలు, ఎరువులు, పురుగుమందులు, ఆహారపదార్థాల కల్తీకి పాల్పడేవారిపై కఠినచర్యలు తీసుకొనే అంశాలను సవరణచట్టంలో చేర్చారు. దీంతో పీడీయాక్ట్ మరింత సమర్థంగా అమలుచేసేందుకు వీలు కలుగుతుందని కేంద్రహోంశాఖ వర్గాలు తెలిపాయి.

7388
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles