వేలం ద్వారా రాజీవ్ స్వగృహ ప్లాట్ల విక్రయం

Fri,August 5, 2016 03:51 PM

Rajiv home plots sold by auction

హైదరాబాద్ : నాగోల్ బండ్లగూడలోని రాజీవ్ స్వగృహ ఇళ్లను గృహ నిర్మాణ శాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ఈ నెల 7 నుంచి 17వ తేదీ వరకు ఆన్‌లైన్ వేలం ద్వారా రాజీవ్ స్వగృహ ప్లాట్లను విక్రయిస్తామని తెలిపారు. ఆన్‌లైన్ వేలం ద్వారా బండ్లగూడ, పోచారంలోని ఐదు వేల ప్లాట్లను విక్రయిస్తామన్నారు. ప్రభుత్వ ఆదేశాల మేరకే ప్లాట్లను విక్రయించాలని నిర్ణయించామని స్పష్టం చేశారు. రూ. 50 కోట్లతో ప్లాట్లను ఆధునీకరిస్తామని చెప్పారు. ప్లాట్లకు సంబంధించి పెండింగ్‌లో ఉన్న పనులను త్వరగా పూర్తి చేస్తామని ప్రకటించారు.

1994
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles