ఆ ఒక్క జిల్లాలోనే 91 సమస్యాత్మక ప్రాంతాలు: రజత్‌ కుమార్‌

Sat,October 20, 2018 01:29 PM

 Rajat Kumar Holds Meeting With All District Collectors Over   Elections

హైదరాబాద్: జీహెచ్‌ఎంసీ కార్యాలయంలో రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి రజత్ కుమార్ సమీక్ష నిర్వహించారు. సమావేశానికి అన్ని జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎన్నికల ఏర్పాట్లపై జిల్లా ఎన్నికల అధికారులు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు.

సమావేశం అనంతరం రజత్ కుమార్ మాట్లాడుతూ.. ఈనెల 25లోపు సవరించిన ఓటర్ల జాబితాను రాజకీయ పార్టీలకు అందజేయాలని సూచించారు. పక్కా భవనాల్లో పోలింగ్ కేంద్రాలు ఉండేలా చూడాలి. శిథిలావస్థలో ఉన్న పోలింగ్ బూత్‌లను వెంటనే మార్చాలి. అన్ని పోలింగ్ కేంద్రాల్లో విద్యుత్ ఉండేలా చర్యలు తీసుకోవాలి. కొన్ని సమస్యాత్మక ప్రాంతాలపై పునరాలోచించాలి. పోలింగ్ శాతాన్ని పెంచేలా జిల్లాల ఎన్నికల అధికారులు చర్యలు తీసుకోవాలి. 5 రాష్ర్టాల సరిహద్దుల్లో ఉన్న చెక్‌పోస్టుల వద్ద భద్రత కట్టుదిట్టం చేయాలి. ఆదిలాబాద్ జిల్లాలోనే 91 సమస్యాత్మక ప్రాంతాలు ఉన్నాయంటే ఏంటీ అర్థం అని అధికారులను ప్రశ్నించారు. ఏ ప్రాతిపదికన సమస్యాత్మక ప్రాంతాలను గుర్తించారో వివరాలు అందజేయాలని పేర్కొన్నారు. ఈవీఎంలపై అనుమానాల నివృత్తికి సిబ్బంది అందుబాటులో ఉన్నారు. ఈవీఎంల పరిశీలనను చిత్రీకరిస్తున్నాం. ఎన్నికల ఏర్పాట్లపై ఎప్పటికప్పుడు కేంద్ర ఎన్నికల సంఘానికి నివేదిక పంపుతున్నామని వివరించారు.

2690
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles