రాజన్న హుండీ ఆదాయం రూ.1.02 కోట్లు

Tue,March 13, 2018 08:58 PM

rajarajeswara swamy devasthanam income was Rs 1.02 crores Vemulawada

వేములవాడ : వేములవాడ శ్రీ పార్వతీ రాజరాజేశ్వర స్వామివారికి కేవలం 21 రోజుల్లో హుండీ ద్వారా దాదాపు రూ.1.02 కోట్ల ఆదాయం సమకూరిందని ఆలయ ఈవో దూస రాజేశ్వర్ తెలిపారు. రాజన్న ఆలయ ఓపెన్‌స్లాబ్‌పై నిర్వహించిన ఈ హుండీ లెక్కింపులో 218 గ్రాముల బంగారం, 13.3 కిలోల వెండి సమకూరిందని వివరించారు. ఈసారి సైతం దాదాపు రూ.87,500 విలువైన రద్దయిన వెయ్యి, ఐదు వందల నోట్లు హుండీలో లభించాయని వెల్లడించారు.

827
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles