విదేశీ విద్యార్జనకు ట్రావెల్ ఫండ్..

Thu,December 6, 2018 09:54 PM

Raja Bahadur Venkatarama Reddy Educational Society Travel fund for foreign students

హైదరాబాద్ : విదేశాల్లో విద్యనభ్యసించాలనుకునే పేద విద్యార్థులను ప్రొత్సహించేందుకు రాజ బహద్దూర్ వెంకటరామారెడ్డి ఎడ్యుకేషనల్ సొసైటీ ముందుకొచ్చింది. ఉన్నత విద్యార్జనకు వెళ్లే గ్రామీణ ప్రాంతాల్లోని వ్యవసాయ కుటుంబీకులైన విద్యార్థులకు ట్రావెల్ ఫండ్ క్రింద ఒక ప్రయాణ ఖర్చును సమకూర్చబోతున్నది. వడ్డీ రహిత మొత్తాన్ని విద్యార్థులు మూడేండ్ల తర్వాత విద్యార్థులు తిరిగి చెల్లించాల్సి ఉంటుంది. ఆసక్తి గల వారు www.rbvrres.com వెబ్‌సైట్‌ను సంప్రదించి దరఖాస్తులను డౌన్‌లోడ్ చేసుకుని, పూర్తిచేసిన దరఖాస్తులను డిసెంబర్ 28లోపు సమర్పించాలని సొసైటీ కార్యదర్శి ఒక ప్రకటనలో తెలిపారు. డిసెంబర్ 31వ తేదీన ఇంటర్వ్యూలను నిర్వహించి, అభ్యర్థులను ఎంపిక చేస్తామని తెలిపారు.

478
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS