నేడు, రేపు మోస్తరు వర్షాలు

Sun,December 16, 2018 09:32 AM

Rains in Telangana today and tomorrow

హైదరాబాద్ : ఆగ్నేయ బంగాళాఖాతంలో కొనసాగుతున్న తీవ్ర వాయుగుండం పశ్చిమ వాయవ్య దిశగా ప్రయాణించి మచిలీపట్నంకు దక్షిణ ఆగ్నేయంగా 870 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉన్నదని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఆదివారం పెథాయ్ తుఫాన్‌గా మారే అవకాశం ఉన్నట్టు పేర్కొన్నది. సోమవారానికి పెను తుఫాన్‌గా మారి ఒంగోలు, కాకినాడ మధ్య తీరందాటే అవకాశం ఉన్నదని, ఫలితంగా ఆది, సోమవారాల్లో తెలంగాణలో అక్కడక్కడ చిరుజల్లుల నుంచి ఓ మోస్తరు వర్షాలు, కోస్తాంధ్రలో మోస్తరు నుంచి భారీ వానలు కురిసే అవకాశం ఉన్నట్టు వాతావరణ కేంద్రం తెలిపింది.
గ్రేటర్‌పై పెథాయ్ ప్రభావం..
పెథాయ్ ప్రభావం వల్ల మరో 24 గంటలు గ్రేటర్ హైదరాబాద్‌లో వర్షాలు కురిసే అవకాశమున్నదని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది.

3201
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles