ఈనెల 18న తెలంగాణలో మోస్తారు వర్షాలు..

Sun,December 16, 2018 06:15 PM

rains in telangana in this month 18th says indian meteorological department

హైదరాబాద్: ఈనెల 18న తెలంగాణలో మోస్తారు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ శాఖ డైరెక్టర్ వైకే రెడ్డి తెలిపారు. కాకినాడ పరిసర ప్రాంతాల్లో రేపు మధ్యాహ్నం తుపాన్ తీరం దాటుతుంది. తీర ప్రాంతాల్లో 60 నుంచి 70 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయి. నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో కాకుండా అంతటా వర్షాలు కురుస్తాయి. రేపు ఉదయం నుంచి ఎల్లుండి వరకు భారీ వర్షాలు కురుస్తాయి. మత్స్యకారులు సముద్రంలోకి వెళ్లొద్దు. విశాఖపట్నం, శ్రీకాకుళంలో భారీ వర్షాలు పడుతాయి. రాయలసీమపై వర్షాలు తక్కువగా పడే అవకాశముందని అయన తెలిపారు.

1868
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles