జనగామ, సిద్దిపేటలో వర్షం.. తడిసిన ధాన్యం

Wed,April 17, 2019 04:51 PM

Rains in Janagama and Siddipet

హైదరాబాద్: జనగామ జిల్లా వ్యాప్తంగా వర్షాలు విస్తారంగా కురిశాయి. జనగామ, నర్మెట్ట, తరిగొప్పులలో వర్షం విపరీతంగా పడింది. రెండు గంటలుగా ఎడతెరపిలేకుండా వర్షం కురువడంతో పలు చోట్ల ధాన్యపు రాశులు తడిశాయి. అదేవిధంగా సిద్దిపేట జిల్లా సైదాపూర్, జమ్మికుంట, హుస్నాబాద్, కోహెడ, కుందనవానిపల్లిలో వర్షం కురిసింది. వర్షానికి హుస్నాబాద్ మార్కెట్‌యార్డులో 300 క్వింటాళ్ల మేర ధాన్యం తడిసింది. అక్కన్నపేట మండలం కుందనవానిపల్లిలో పడిన పిడుగుపాటుకు ఓ గేదె మృతిచెందింది.

829
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles