రాగల 36గంటల్లో వర్షసూచన

Sun,July 21, 2019 09:36 PM

Rainfall in the coming 36 hours Hyderabad

హైదరాబాద్ : రుతుపవనాలు చురుకుగా కదులుతున్న నేపథ్యంలో రాగల 36గంటల్లో గ్రేటర్‌లోని పలు చోట్ల మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఉదయం నుంచి వాతావరణం చల్లబడినప్పటికీ మధ్యాహ్నం సమయానికి ఎండ తీవ్రత పెరిగింది. ఉదయం నుంచి సాయంత్రం 5.30గంటల వరకు నగరంలో గరిష్ట ఉష్ణోగ్రత 31.6డిగ్రీలు, కనిష్ట ఉష్ణోగ్రత 22.3డిగ్రీల సెల్సియస్, గాలిలో తేమ 61శాతంగా నమోదైనట్లు వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు.

1056
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles