హుస్సేన్‌సాగర్ నుంచి వరద నీటి విడుదల

Wed,August 31, 2016 02:21 PM

rain water released from  hussain sagar

హైదరాబాద్‌ను భారీ వర్షం ముంచెత్తుతోంది. దీంతో భాగ్యనగరం నడిబొడ్డున ఉన్న హుస్సేన్‌సాగర్ నిండుకుండను తలపిస్తోంది. నగరం చుట్టుపక్కల కురుస్తోన్న భారీ వర్షాల కారణంగా హుస్సేన్‌సాగర్‌లోకి భారీగా వర్షపునీరు వచ్చి చేరుతోంది. దీంతో అధికారులు హుస్సేన్‌సాగర్ తూములను తెరిచి వరద నీటిని దిగువ ప్రాంతానికి వదులుతున్నారు. నీటి విడుదల సందర్బంగా నగర మేయర్ బొంతు రామ్మోహన్, జీహెచ్‌ఎంసీ కమిషనర్ జనార్దన్‌రెడ్డి, పలువురు ఇతర అధికారులు హాజరయ్యారు. ఈమేరకు హుస్సేన్‌సాగర్ నాలాలకు సమీపంలోని లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని నగర మేయర్ బొంతు రామ్మోహన్ విజ్ఞప్తి చేశారు. కాగా, హుస్సేన్ సాగర్ నీటి మట్టాన్ని సగానికి తగ్గించనున్నారు.

5946
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

country oven

Featured Articles

Health Articles