మా ఊరి చెరువు నిండింది.. వీడియో

Mon,June 19, 2017 03:58 PM

నైరుతి రుతుపవనాల రాకతో రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు కురుస్తున్నాయి. భారీ వర్షాలకు వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. చెరువుల్లోకి వరద నీరు భారీగా రావడంతో అలుగు పారుతున్నాయి. రంగారెడ్డి జిల్లా తలకొండపల్లి మండలంలోని చీపునుంతల చెరువులోకి భారీగా వరద నీరు వచ్చి చేరుతుంది. దీంతో ఆ గ్రామ ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే 50 శాతం చెరువు నిండిందని చెబుతున్న రైతులు.. మృగశిర కార్తెలో తొలిసారిగా మా ఊరి చెరువు నిండుతుందని ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

2448

More News

మరిన్ని వార్తలు...