హైదరాబాద్‌లో వర్షం

Mon,July 17, 2017 04:09 PM

హైదరాబాద్ : హైదరాబాద్ నగరంలో సోమవారం సాయంత్రం భారీ వర్షం కురిసింది. బంజారాహిల్స్, జూబ్లీహిల్స్‌లో కురిసిన వర్షానికి రోడ్లన్నీ జలమయం అయ్యాయి. పలుచోట్ల ట్రాఫిక్ స్తంభించిపోయింది. లోతట్టు ప్రాంతాలు జలమయం కావడంతో అటు ప్రజలు, ఇటు వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు.

మరో మూడు రోజులు వర్షాలు
వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడనం కొనసాగుతుంది. ఈ అల్పపీడనం వచ్చే 24 గంటల్లో మరింత బలపడే అవకాశం ఉంది. ఈ నెల 19 లోపు వాయుగుండంగా మారే అవకాశం ఉంది. అల్పపీడన ప్రభావంతో రాష్ట్రవ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. వచ్చే మూడు రోజులు కూడా పలుచోట్ల భారీ వర్షాలు కురియనున్నాయి.

2420

More News