గ్రేటర్ హైదరాబాద్‌కు వర్షసూచన

Thu,June 13, 2019 07:31 AM

Rain forecast for Greater Hyderabad

హైదరాబాద్ : గ్రేటర్ హైదరాబాద్‌లో పగటి ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పట్టినప్పటికీ గాలిలో తేమ తగ్గడంతో ఉక్కపోత ఉక్కిరిబిక్కిరి చేస్తున్నది. మరో మూడ్రోజుల వరకు ఇవే పరిస్థితులు ఉంటాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. గరిష్ఠ ఉష్ణోగ్రత 39 డిగ్రీలు, కనిష్ఠ ఉష్ణోగ్రత 28.2 డిగ్రీలు, గాలిలో తేమ 39 శాతంగా నమోదైందని వెల్లడించారు. క్యుములోనింబస్ మేఘాల ప్రభావంతో రాగల 24 గంటల్లో గ్రేటర్‌లో అక్కడక్కడ వర్షాలు కురిసే అవకాశం ఉన్నదని తెలిపారు.

337
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles