రాహుల్‌గాంధీ ఓ పెద్ద బఫూన్: కేసీఆర్

Thu,September 6, 2018 05:30 PM

Rahul Gandhi is the biggest buffoon in the country says KCR

హైదరాబాద్: కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్‌గాంధీపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు సీఎం కేసీఆర్. అసెంబ్లీ రద్దు ప్రకటన తర్వాత మీడియా సమావేశంలో మాట్లాడిన ఆయన.. రాష్ర్టానికి కాంగ్రెస్ పీడ విరగడవ్వాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా రాహుల్ గురించి మాట్లాడుతూ.. దేశంలోనే ఆయనో పెద్ద బఫూన్ అని కేసీఆర్ అన్నారు. రాహుల్‌గాంధీ ఏంటో అందరికీ తెలుసు. దేశంలోనే పెద్ద బఫూన్ ఆయన. లోక్‌సభలో నరేంద్ర మోదీ దగ్గరకు వెళ్లి ఆయనను హత్తుకోవడం, కన్ను కొట్టడం దేశమంతా చూసింది అని కేసీఆర్ అన్నారు. ఇక రాష్ట్రంలో రాహుల్ ప్రచారం గురించి స్పందిస్తూ.. రాహుల్ మాకు పెద్ద ఆస్తి. ఆయన తెలంగాణలో ఎంత ఎక్కువగా పర్యటిస్తే.. అన్ని ఎక్కువ సీట్లు మేం గెలుస్తాం అని ఆయన చెప్పారు. తెలంగాణ ప్రజలు ఢిల్లీకి గులాంలుగా మారొద్దని స్పష్టంచేశారు. తెలంగాణ నిర్ణయాలను తెలంగాణలోనే తీసుకోవాలని కేసీఆర్ అన్నారు.

4593
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles