HomeLATEST NEWSRadio Frequency Identification implement at Outer Ring Road

ఆర్‌ఎఫ్‌ఐడికి ఔటర్ వాహనదారులు ఫిదా!

Published: Mon,May 20, 2019 07:19 AM
  Increase Font Size Reset Font Size decrease Font size   
హైదరాబాద్ : ఔటర్‌లో నాన్‌స్టాప్ ప్రయాణానికి అపూర్వ ఆదరణ లభిస్తోంది. టోల్‌గేట్ల వద్ద ఎక్కువ సేపు ఆగాల్సిన పనిలేకుండా త్వరగా వెళ్లడం, తద్వారా వాహనాల రద్దీని తగ్గించేందుకుగానూ హెచ్‌ఎండీఏ రేడియోఫ్రీక్వెన్సీ ఐడెంటిఫికేషన్(ఆర్ఎఫ్‌ఐడి) విధానాన్ని అమలు చేస్తున్నది. ఈ ఫాస్టాగ్ విధానంతో వాహనదారులకు ప్రయాణం మరింత సులువు అయింది. ముందుగా నగదు రహిత చెల్లింపుల సౌకర్యంతో పొందే ఈ ఆర్‌ఎఫ్‌ఐడి ఫాస్టాగ్ వాహనానికి ముందు భాగాన అమర్చడం వల్ల ఆయా వాహనం టోల్‌గేట్ వద్దకు రాగానే ఆటోమెటిక్(దానంతట అదే) గేటు తెరచుకుంటుంది.

ఆన్‌లైన్, నగదు రహిత చెల్లింపులతో కూడిన ఈ పద్ధతి వల్ల ఒత్తిడితో కూడిన అవాంతరాలను పూర్తిగా తొలిగిపోతున్నాయని, ముఖ్యంగా అమూల్యమైన సమయాన్ని వృధా కాకుండా నియంత్రించుకునే వీలు ఉంటుందని వాహనదారులు అభిప్రాయపడుతున్నారు. ఫాస్టాగ్ కార్డులు ఇప్పటి వరకు 14వేల వరకు తీసుకున్నారని, ఈ విధానానికి అనూహ్య స్పందన లభిస్తుందని ఔటర్ రింగు రోడ్డు విభాగం అధికారులు చెబుతున్నారు.

ఔటర్‌లో ప్రయాణం చేసే వాహనదారులు రూ.200లు పెట్టి టోల్‌బూతుల వద్ద సిమ్ కార్డు మాదిరిగా ఉండే రేడియో ప్రీక్వెన్సీ ఐడెంటిఫికేషన్ (ఆర్‌ఎఫ్‌ఐడీ) ట్యాగ్‌లను కొనుగోలు చేయాల్సి ఉంటుంది. ఎప్పటికప్పుడు రీఛార్జీ చేసుకోవాలి. ఆ ట్యాగ్(స్టిక్కర్)లను కారు ముందు అద్దంపై అతికించాలి. ఈటీసీ లేన్ల వద్ద ఏర్పాటు చేసిన కార్డు రీడర్లు.. వంద మీటర్ల దూరంలో ఉండగానే పని ప్రారంభిస్తాయి. వివరాలను నమోదు చేసుకుంటాయి. దిగే ముందు ఎంత చెల్లించాలో లెక్క కడుతాయి. ఒకవేళ కార్డులో బ్యా లెన్స్ ఉంటే ఆటో మేటిక్ గేట్లు తెరచుకుంటాయి. లేకపోతే మ్యాన్‌వల్ పద్దతిలో చెల్లించాల్సి ఉంటుంది. నానక్‌రాంగూడ, శంషాబాద్, మేడ్చల్, ఘట్కేసర్, పటాన్‌చెరులోని టోల్ ప్లాజా కేంద్రాలలో ఈ ఫాస్ట్ ట్యాగ్‌ల విక్రయ కేంద్రాలు ఏర్పాటు చేసి ఫాస్టాగ్‌లను ఉచితంగా జారీ చేస్తున్నారు

ఫలించిన ఆఫర్ల ప్రయోగం
మొదటి రెండు లక్షల వాహనాలు, కార్లు/జీపులు, చిన్న తరహా వాహనాల కేటగిరిలోని వాహనాలకు ఎలాంటి సెక్యూరిటీ డిపాజిట్ లేకుండానే జారీ చేస్తున్నారు.
-ముందుగా నిధుల నిల్వ ఉన్నట్లయితే ఫాస్ట్ ట్యాగ్ ఉన్న వాహనాల రాకపోకలపై ఎలాంటి నియంత్రణ ఉండదు. టోల్ ఫ్లాజాలో ఫా స్టాగ్ కలిగి ఉన్న వాహనాలు వెళ్లేం దుకు ప్రత్యేక దారి ఏర్పాటు చేశారు.
- తరచుగా ప్రయాణించే ప్రయాణికులు నెలవారీ పాసులు కూడా కొనుగోలు చేసుకునే వెసులుబాటు ఉంది. ఆన్‌లైన్‌లో కానీ ఫాస్ట్ ట్యాగ్ విక్రయ కేంద్రాలైన ఐదు టోల్ ఫ్లాజా లలో ఈ పాసులు తీసుకోవచ్చు. నెలలో 50 సార్లు ప్రయాణించే వారికి నెలవారీ పాసులు చెల్లుబాటు ఉంటుంది. ఈ పాసులు కొనుగోలు చేసిన వారికి 24 గంటలలోని తిరుగు ప్రయాణంలో రాయితీ కూడా లభించనుంది.

ఉదాహరణకు నానక్‌రాంగూడ నుంచి పెద్ద అంబర్ పేట వరకు ప్రయాణానికి రెండు వైపులకు కలిపి రూ. 110లు కట్ అవుతాయి. 24 గంటల్లో తిరిగి ఆదే మార్గంలో ప్రయాణం చేయగానే 50శాతం అంటే రూ. 65లు మన ఖాతాలో చేరనున్నాయి.ఆలాగే నిత్యం ఔటర్‌పై ప్రయాణించే వాహనాలకు నెలసరి పాసులు తీసుకుంటే ప్రతి ప్రయాణంలో 33శాతం రాయితీ వర్తిస్తుంది. ఫాస్టాగ్‌లను ప్రోత్సహించేందుకు ఔటర్‌పై ఉన్న నానక్ రాంగూడ, శంషాబాద్, మేడ్చల్, ఘట్‌కేసర్, పటాన్‌చెరు తదితర టోల్‌ప్లాజాల వద్ద ఫా స్టాగ్ స్టిక్కర్లను ఉచితంగా అందజేస్తున్నారు. ఇందులో కనీసం రూ. 200 రీఛార్జి చేసు కోవాల్సి ఉంటుంది. ఫాస్టాగ్ సర్వీస్ బ్యాంకుగా ఉన్న ఐసీఐసీఐ కూడా 5 శాతం రాయితీని కల్పిస్తున్న సంగతి తెలిసిందే.
1212
Tags

More News

NATIONAL-INTERNATIONAL

SPORTS

Health

Technology