బెస్ట్ ప్రిన్సిపాల్ అవార్డు అందుకున్న విజయలలిత

Sat,January 26, 2019 03:29 PM

R Vijaya Lalitha got best principal award by TTWREI society

రంగారెడ్డి : తెలంగాణ గిరిజన గురుకుల జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ ఆర్. విజయలలితకు ఉత్తమ ప్రిన్సిపాల్ అవార్డు దక్కింది. జిల్లాలోని జంగంమెట్ గిరిజన గురుకుల జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్‌గా విధులు నిర్వహిస్తున్న విజయలలితకు తెలంగాణ ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషన్ సొసైటీ ఆధ్వర్యంలో ఈ అవార్డుకు ఎంపికైంది. గణతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా జిల్లా కలెక్టర్ లోకేష్ చేతుల మీదుగా ఆమె అవార్డును అందుకున్నారు. ఈ నేపథ్యంలో విజయలలితకు కళాశాల టీచర్లు, విద్యార్థినులు అభినందిస్తూ శుభాకాంక్షలు తెలిపారు.

1024
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

country oven

Featured Articles

Health Articles