ఘనంగా క్వారీ దుర్గాదేవి జాతర

Sun,July 21, 2019 09:07 PM

Quarry Durga Devi Jatara in Mancherial

మంచిర్యాల : మంచిర్యాల జిల్లా హాజీపూర్ మండలం గఢ్‌పూర్‌లోని క్వారీ దుర్గా దేవి జాతర ఘనంగా జరిగింది. ఉదయం నుంచే భక్తుల రాక మొదలు కాగా, వాహన పూజలు, అమ్మవారికి మొక్కులు, సామూహిక వన భోజనాలతో ఆ ప్రాంతమంతా కోలాహలంగా మారింది. అలాగే అక్కడున్న పోచమ్మ, నాగదేవత ఆలయాల్లోనూ భక్తులు సాయంత్రం వరకు ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా మంచిర్యాల ఎమ్మెల్యే దివాకర్‌రావు, పెద్దపల్లి ఎంపీ బోర్లకుంట వెంకటేశ్ నేత, జిల్లా కలెక్టర్ భారతీ హోళికేరి దుర్గాదేవిని దర్శించుకున్నారు. జిల్లాతో ఆసిఫాబాద్, మహారాష్ట్ర, పెద్దపల్లి జిల్లాలోని గోదావరిఖని ప్రాంతాల నుంచి సుమారు లక్ష మంది వచ్చినట్లు ఆలయ నిర్వాహకులు తెలిపారు.

394
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles