రాజకీయంగా ఎదుర్కోలేకే అసత్యపు ఆరోపణలు..

Sun,September 30, 2018 08:51 PM

putta madhu speaks to media over allegations on him

మంథని: ఒక బీద బీసీ బిడ్డ ఎమ్మెల్యే స్థాయికి ఎదిగితే ఓర్వలేకపోతున్నారు.. మళ్లీ గెలవద్దని ఎన్నో కుట్రలు, కుతంత్రాలు పన్నుతున్నారు.. నేను ఎమ్మెల్యేగా పనిచేసిన నాలుగేళ్ల మూడు నెలల్లో 900 కోట్లు సంపాదించానంటున్నారు.. అంటే రోజుకు 50 లక్షలు.. నెలకు 15 కోట్లు.. ఇది ఏ ప్రజా ప్రతినిధికైనా సాధ్యమేనా..? నన్ను రాజకీయంగా ఎదుర్కోలేకే కాంగ్రెస్ నాయకులు ఇలాంటి అసత్యపు ఆరోపణలు చేస్తున్నారు.. బ్లాక్ మెయిల్ రాజకీయాలకు ఏ మాత్రం భయపడేది లేదు.. ఇదిగో.. నేనే లేఖ రాస్తున్నా.. నా ఆస్తులు, సంపాదనలపై హైకోర్టు చీఫ్ జస్టిస్, ఇన్‌కం టాక్స్ చీఫ్ కమిషనర్ విచారణ జరిపించాలి అని మంథని తాజా మాజీ ఎమ్మెల్యే పుట్ట మధు విజ్ఞప్తి చేశారు.

తనపై వస్తున్న ఆరోపణలపై ఆదివారం పెద్దపల్లి జిల్లా మంథనిలో మీడియా సమావేశం నిర్వహించి ఆయన మాట్లాడారు. తనను రాజకీయంగా ఎదుర్కోలేకే కొంత మంది బ్లాక్ మెయిలర్లు ఇలాంటి అసత్యపు ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. ప్రజాస్వామ్యంలో నాలుగో స్తంభమైన మీడియా ఇలా బాధ్యతాయుతంగా ఎవరు ఏది చెబితే దాన్ని వారి రేటింగ్, ప్రచారం కోసం ప్రచురణ, ప్రసారాలు చేయడం ప్రజాస్వామ్యానికే గొడ్డలి పెట్టు అన్నారు.

ఒక మూర్కుడు, దోపిడీ దారుడిగా మంథని పోలీస్ స్టేషన్లో కేసులు అనుభవిస్తున్న వారు.. గౌరవ ప్రదంగా అత్యున్నతమైన పదవుల్లో ఉన్న తమపై నిరాధారమైన ఆరోపణలు చేస్తుంటే ఒక్క ఆధారం కూడా అడగకుండా టీవీల్లో, పేపర్లల్లో చూపించడం, రాయడం అప్రజాస్వామికం, దురదృష్టకరమన్నారు. మంథనిలోని ఆంధ్రాబ్యాంకుకు బాంబు పెడుతూ దొరికిపోయి కేసు అనుభవించి, ఇక్కడ వ్యాపారస్తులను బెదిరిస్తూ లంచాలను అడిగిన కేసులను అనుభవిస్తున్న వ్యక్తులు కేసులు వేస్తే వాటిని ప్రచురించడం ఎంత వరకు సమంజసమన్నారు.

4804
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles