బాధితులను ఆప్యాయంగా ప‌ల‌క‌రించండి : నిర్మ‌ల్ ఎస్పీ

Mon,June 19, 2017 03:40 PM

నిర్మల్ : జిల్లా ఎస్పీ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజా ఫిర్యాదుల విభాగంలో జిల్లాలోని పలువురు బాధితులు పాల్గొని తమ సమస్యలను వివరించి ఎస్పీ విష్ణు ఎస్ వారియర్‌కు అర్జీలు అందజేశారు. బాధితుల సమస్యలు తెలుసుకున్న ఎస్పీ.. తక్షణమే సంబంధిత పోలీసు అధికారులతో ఫోన్ ద్వారా మాట్లాడి వారి సమస్యలను పరిష్కరింపజేయాలని ఆదేశించారు. అనంతరం ఎస్పీ మాట్లాడుతూ.. పోలీసు స్టేషన్‌కు ఫిర్యాదు చేసేందుకు వచ్చే బాధితులను ఆప్యాయంగా పలకరించి.. మంచి నీరివ్వాలని పోలీసులకు సూచించారు.

రాత్రి సమయంలో గస్తీతో పాటు పెట్రోలింగ్, వాహనాలను తనిఖీలు చేస్తూ చురుకుగా పని చేయాలన్నారు. పోలీసులు ప్రజలకు జవాబుదారీగా ఉండాలన్నారు. కాలనీల్లో అనుమానాస్పదంగా వ్యక్తులు సంచరించినట్లయితే సంబంధిత పోలీసు స్టేషన్ ఎస్‌ఐ లేదా సీఐకి ఫోన్ ద్వారా తెలియజేయాలని సూచించారు. లేనిచో జిల్లా వాట్సప్ నెం. 8333986939కు సమాచారం తెలియజేయాలని చెప్పారు. పోలీసులు ఎల్లవేళలా ప్రజలకు అందుబాటులో ఉంటారని ప్రజలకు సేవ చేయడంలో నిర్మల్ పోలీసులు ముందుంటారని భరోసా ఇచ్చారు.

459

More News

మరిన్ని వార్తలు...