మసాజ్‌ ముసుగులో..

Fri,May 24, 2019 07:06 AM

prostitution in saloon centres 2 arrested


సికింద్రాబాద్ : వ్యభిచారం నిర్వహిస్తున్న మసాజ్‌, సెలూన్‌ సెంటర్‌పై మారేడ్‌పల్లి పోలీసులు దాడులు నిర్వహించారు. మసాజ్‌ సెంటర్‌ మేనేజర్‌, విటుడిని అరెస్ట్‌ చేసి రిమాండ్‌కు తరలించగా, ముగ్గురు యువతులను పునరావాస కేంద్రానికి తరలించారు. ఇన్‌స్పెక్టర్‌ శ్రీనివాసులు తెలిపిన వివరాల ప్రకారం....వెస్ట్‌మారేడ్‌పల్లి ప్రధాన రహదారిలోని ఓ భవనంలో ‘స్టూడియో మేక్‌ ఓవర్‌ సెలూన్‌ అండ్‌ స్పా’ పేరుతో మాసాజ్‌, సెలూన్‌ కేంద్రాన్ని నిర్వాహకురాలు మమత నిర్వహిస్తుంది. ఈ కేంద్రానికి మేనేజర్‌గా శేఖర్‌ వ్యవహరిస్తున్నాడు. అయితే కొంత కాలంగా ఈ సెంటర్‌లో మసాజ్‌ పేరుతో వ్యభిచారం నిర్వహిస్తున్నారు.

ఈ విషయంపై పోలీసులకు సమాచారం అందింది. వెంటనే డీఐ పద్మ, ఎస్‌ఐ రవి, ఏఎస్‌ఐ గౌరి, మహిళా హోంగార్డు కనకలక్ష్మి, కానిస్టేబుల్స్‌ సతీష్‌, రాజులు ఆ కేంద్రంపై దాడి నిర్వహించారు. ఈ దాడిలో ముగ్గురు వ్యభిచారులు, ఒక విటు డు, ఈ కేంద్రం మేనేజర్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మేనేజర్‌ శేఖర్‌, విటుడు కిరణ్‌బాబులను అరెస్ట్‌ చేసి రిమాండ్‌కు తరలించించగా, నిర్వాహకురాలు మమత పరారీలో ఉందని పోలీసులు తెలిపారు. ముగ్గురు వ్యభిచారులను మహేశ్వరంలోని పునరావాస కేంద్రానికి తరలించినట్లు పోలీసులు వెల్లడించారు. ఈ మేరకు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

2655
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles