ఎస్‌వోటీ పోలీసుల అదుపులో వ్యభిచార ముఠా

Fri,August 23, 2019 06:34 AM

prostitution gang arrested in kushaiguda ps limits


మల్లాపూర్‌ : కుషాయిగూడ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో వ్యభిచారం నిర్వహిస్తున్న ఓ ముఠాను గురువారం ఎస్‌ఓటీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. గత కొంత కాలంగా ఓ ముఠా కుషాయిగూడ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో వ్యభిచారం నిర్వహిస్తున్నట్లు సమాచారం అందుకున్న మల్కాజిగిరి ఎస్‌ఓటీ పోలీసులు ఆ స్థావరంపై దాడి చేసి ముఠాను అదుపులోకి తీసుకున్నారు. విచారణ నిమిత్తం కుషాయిగూడ పోలీసులకు అప్పగించారు. ఈ విషయమై ఇన్‌స్పెక్టర్‌ చంద్రశేఖర్‌ను వివరణ కోరగా, వ్యభిచార ముఠాను పట్టుకున్న విషయం వాస్తవమేనంటూ.. కేసు విచారణలో ఉన్నందున వివరాలు వెల్లడించలేమన్నారు. ఈ ముఠాకు సంబంధించిన మరింత సమాచారం రాబట్టాల్సి ఉందని, విచారణ పూర్తి చేసి శుక్రవారం వివరాలు వెల్లడిస్తామన్నారు.

951
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles