ప్రైవేటు స్కూళ్లలో ఆన్‌లైన్ ద్వారా ప్రవేశాలు

Sun,November 26, 2017 06:19 AM

private schools Admission through online

హైదరాబాద్ : రాష్ట్రంలోని అన్ని ప్రైవేటు స్కూళ్లలో ఆన్‌లైన్ ద్వారా ప్రవేశాలు చేపట్టాలని పాఠశాల విద్యాశాఖ సూత్రప్రాయంగా నిర్ణయించింది. దీని సాధ్యాసాధ్యాలపై కసరత్తు చేస్తున్నది. ఇప్పటికే ప్రైవేటు స్కూల్ యాజమాన్యాలు, అధికారులతో సమావేశమైన పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ జీ కిషన్.. ఆన్‌లైన్ అడ్మిషన్లకు సంబంధించిన అంశాలపై వారితో చర్చించారు. ఇందులో భిన్నాభిప్రాయాలు వ్యక్తమైనప్పటికీ ఆన్‌లైన్ ప్రవేశాల నిర్వహణకే పాఠశాల విద్యాశాఖ మొగ్గు చూపుతున్నది. దీనిపై ప్రభుత్వానికి సమర్పించాల్సిన తాజాగా ప్రతిపాదనలు రూపొందిస్తున్నది. ఇప్పటికే ప్రైవేటు, కార్పొరేట్, ఇంటర్నేషనల్ స్కూళ్లు అధిక ఫీజులు వసూలు చేస్తున్నాయి.

పైగా కొత్తగా అడ్మిషన్లు పొందే విద్యార్థుల నుంచి భారీ మొత్తంలో డొనేషన్లు పిండుతున్నాయి. ఆన్‌లైన్ ప్రవేశాలు మొదలైతే బోగస్ ఎన్‌రోల్‌మెంట్‌కు చెక్‌పడటంతోపాటు అధిక ఫీజులను నియంత్రించడం సాధ్యమవుతుందని అధికారులు భావిస్తున్నారు. డిస్ట్రిక్ట్ ఫీజు రెగ్యులేషన్ కమిటీ (డీఎఫ్‌ఆర్సీ) నిర్ణయించిన ఫీజులనే ఆన్‌లైన్లో చూపించాల్సి ఉంటుంది. డొనేషన్లు తీసుకొనే విధానం తగ్గిపోతుంది. పైగా స్కూల్, క్లాస్‌వారీగా విద్యార్థుల సంఖ్య, వారిలో బాలబాలికలు, సామాజిక నేపథ్యం, విద్యార్థుల మానసిక, ఆరోగ్య, వ్యక్తిగత వివరాలన్నీ ఆన్‌లైన్ ప్రవేశాల ద్వారా అందుబాటులో ఉంటాయని, డ్రాప్ అవుట్స్ గురించి ఎప్పటికప్పుడు తెలుసుకునే అవకాశం ఉంటుందని అధికారులు చెప్తున్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో కూడా ఆన్‌లైన్ ప్రవేశాలు నిర్వహిస్తే విద్యాభివృద్ధి పథకాల అమలుపై మరింత స్పష్టత తీసుకురావచ్చని అధికారులు భావిస్తున్నారు.

అడ్మిషన్ల తర్వాత అప్‌లోడ్ చేస్తాం
ఆన్‌లైన్ అడ్మిషన్లను తాము వ్యతిరేకిస్తున్నామని ప్రైవేటు స్కూల్ యాజమాన్యాలు చెప్తున్నాయి. తమ అడ్మిషన్ల ప్రక్రియ ముగిసిన తర్వాత విద్యాశాఖ వెబ్‌సైట్‌లో అప్‌లోడ్ చేస్తామని, ఈ విధానం సమ్మతమేనని అంటున్నాయి. ట్యూషన్ ఫీజులపై స్పష్టత రాకుండా ఆన్‌లైన్ అడ్మిషన్లు ఎలా సాధ్యమని ప్రశ్నిస్తున్నాయి. వచ్చే విద్యాసంవత్సరం నుంచి ఆన్‌లైన్ అడ్మిషన్లు నిర్వహించాలని అధికారులు ప్రతిపాదనలను రూపొందిస్తున్నట్టు సమాచారం.

1352
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles