ఫీజు కట్టలేదని పరీక్ష రాయనీయకుండా విద్యార్థుల గెంటివేత

Tue,April 3, 2018 02:45 PM

Private School not cancelled two Annual


మేడ్చల్ జిల్లా : కుషాయిగూడలోని ఓ ప్రైవేటు పాఠశాలలో దారుణం వెలుగుచూసింది. ఫీజు కట్టలేదన్న కారణంతో పాఠశాల యాజమాన్యం ఇద్దరు విద్యార్థులను పరీక్ష రాయనీయకుండా బయటకు గెంటేసింది. దీంతో చేసేదేమి లేక సాయిచరణ్ (7వ తరగతి), రోహాన్ (6వ తరగతి) వార్షిక పరీక్షలు రాయకుండానే బయటకు వచ్చేశారు. ఫీజు ఆలస్యమవడం వల్ల పాఠశాల యాజమాన్యం పరీక్షలు రాయనీయకపోవడంతో విద్యార్థుల తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

839
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

country oven

Featured Articles

Health Articles