జీవిత ఖైదు పడడంతో మనస్థాపానికి గురై..

Wed,July 17, 2019 10:18 PM

Prisoner suicide attempt in nizamabad district jail


నిజామాబాద్‌: నిజామాబాద్‌ జిల్లా కేంద్ర కారాగారంలో జీవిత ఖైదు శిక్ష అనుభవిస్తున్న వడ్ల వెంకటి (62) అనే ఖైదీ ఓపెన్‌ బాత్‌ రూమ్‌ డోర్‌ ప్రేమ్‌కు ఊరివేసుకొని ఆత్మహత్యకు యత్నించాడు. గమనించిన జైలు సిబ్బంది వెంటనే అతడిని చికిత్స నిమిత్తం జిల్లా ప్రభుత్వ దవాఖానకు తరలించారు. అతడిని పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతిచెందినట్లుగా నిర్ధారించారు.

వివరాల్లోకి వెళితే..కామారెడ్డి జిల్లా రాజంపేట మండలం ఆర్గొండ గ్రామానికి చెందిన వడ్ల వెంకటి కుటుంబ కలహాల కారణంగా 2017 డిసెంబర్‌, 26న తన మనవడు దేవేందర్‌ స్వామి(12)ని హతమార్చాడు. అతనిపై రాజంపేట పోలీస్‌ స్టేషన్‌లో కేసు నమోదైంది. నిందితుడిపై నేరం రుజువు కావడంతో కామారెడ్డి జిల్లా న్యాయమూర్తి సత్తయ్య నిందితుడు వెంకటికి జీవిత ఖైదు విధిస్తూ ఈనెల 9న తీర్పు వెలువరించారు. ఆయన్ని అదే రోజు నిజామాబాద్‌ జిల్లాకేంద్ర జైలుకు తరలించారు. వారం రోజులుగా జిల్లా జైలులో ఉన్న వడ్ల వెంకటి మంగళవారం సాయంత్రం సమయంలో జైలులోని ఓపెన్‌ ఎయిర్‌ బాత్‌రూమ్‌లో స్నానానికి వెళ్లి తన వద్ద ఉన్న టవల్‌తో ఉరివేసుకున్నాడు. వెంకటి బాత్‌రూంలో గల బకిట్‌పై ఎక్కి ఉరివేసుకోవడంతో బకెట్‌ చప్పుడు అయ్యింది.

దీంతో గమనించిన తోటి ఖైదీలు జైలు సిబ్బందికి సమాచారం అందించారు. వారు జైలు అధికారికి సమాచారం ఇవ్వడంతో ఆయన ఖైదీని జిల్లా ప్రభుత్వ దవాఖానకు తరలించారు. అతన్ని పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతి చెందినట్లుగా నిర్ధ్దారించారు. ఈ సంఘటనపై జైలు సూపరింటెండెంట్‌ నర్సింహారెడ్డి ఫిర్యాదు మేరకు నిజామాబాద్‌ నగర ఆరో టౌన్‌ ఎస్సై గౌరేందర్‌ కేసు నమోదు చేశారని నిజామాబాద్‌ రూరల్‌ సౌత్‌ జోన్‌ సీఐ రఘునాథ్‌ తెలిపారు. ఖైదీ జైలులో ఆత్మహత్యకు పాల్పడిన ఓపెన్‌ బూత్‌రూమ్‌ను నిజామాబాద్‌ మెజిస్ట్రేట్‌ సందర్శించారు. ఖైదీ ఆత్మహత్య ఘటనపై జ్యుడీషియల్‌ విచారణ చేపట్టారు. అనంతరం ఖైదీ మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించి మృతదేహాన్ని అతని కుటుంబ సభ్యులకు అందజేశారు.

1163
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles