నల్లగొండ, సూర్యాపేట మెడికల్ కాలేజీలకు ప్రిన్సిపాళ్ల నియామకం

Fri,June 22, 2018 04:52 PM

Principals appointed for Nalgonda and Suryapet Medical Colleges

హైదరాబాద్: నల్లగొండ, సూర్యాపేట ప్రభుత్వ మెడికల్ కాలేజీలకు ప్రిన్సిపాళ్లను నియమిస్తూ ప్రభుత్వం నిర్ణయం వెలువరించింది. నల్లగొండ మెడికల్ కాలేజీ ప్రిన్సిపాల్‌గా ప్రొఫెసర్ సి. హెచ్. రాజకుమారిని.. సూర్యాపేట మెడికల్ కాలేజీ ప్రిన్సిపాల్‌గా కె. దుర్గ ని నియమిస్తూ రాష్ట్ర వైద్యారోగ్యశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ఎ. శాంతికుమారి ఆదేశాలు జారీచేశారు. రాజకుమారి ప్రస్తుతం కాకతీయ మెడికల్ కాలేజీలో ఫిజియాలజీ విభాగం అధిపతిగా పనిచేస్తుండగా.. కె. దుర్గ ఉస్మానియా మెడికల్ కాలేజీలో పాథాలజీ విభాగాధిపతిగా విధులు నిర్వర్తిస్తున్నారు.

1318
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles