తెలంగాణ పారిశ్రామిక ఆరోగ్య కేంద్రం ప్రారంభం

Mon,April 2, 2018 11:10 AM

Principal Secretary Jayesh Ranjan inaugurates TIHC at Begumpet

హైదరాబాద్ : ఉమ్మడి రాష్ట్రంలో తీవ్ర నిర్లక్ష్యానికి గురై.. మూతపడ్డ సూక్ష్మ, చిన్నతరహా పరిశ్రమలకు ఆర్థిక సహకారం అందించడమే లక్ష్యంగా ఉద్దేశించిన తెలంగాణ పారిశ్రామిక ఆరోగ్య కేంద్రం(టీఐహెచ్‌సీ) ప్రారంభమైంది. బేగంపేటలోని పర్యాటక భవన్‌లో టీఐహెచ్‌సీని ఈ ఉదయం 10 గంటలకు పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్ రంజన్ ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి టీసీఐఐసీ ఎండీ నరసింహారెడ్డి, హెల్త్ క్లినిక్ సలహాదారు ఎర్రంరాజు హాజరయ్యారు.

ఇండస్ట్రియల్ హెల్త్ క్లినిక్ ద్వారా ఆర్థికంగా చితికిపోయిన పరిశ్రమలకు అన్ని విధాలుగా తోడ్పడనున్నది. నాన్ బ్యాం కింగ్ ఫైనాన్స్ కంపెనీతోపాటు.. ఇతర బ్యాంకుల ద్వారా ఆ పరిశ్రమలకు రుణసౌకర్యాలను అందించేందుకు ప్రభుత్వం పూర్తిస్థాయిలో సహకరిస్తుంది. ఉమ్మడి రాష్ట్రంలో సరైన సహకారం లేక ఎన్నో పరిశ్రమలు మూతపడ్డాయి. ఈ పరిశ్రమలను పునరుద్ధరించేందుకు తెలంగాణ ప్రభుత్వం పూనుకొన్నది. నాన్‌బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీ (ఎన్బీఎఫ్‌సీ) ఏర్పాటుకు గత కొన్ని నెలల క్రితమే ఆర్బీఐ అనుమతించింది. కానీ సెక్యూరిటీస్ అండ్ ఎక్సేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా (సెబీ)కి, ఇతర ఆర్థిక సంస్థలకు మార్చి 31తో ముగిసే ఆర్థిక సంవత్సరానికి సంబంధించి లెక్కలను సమర్పించాల్సి ఉండటంతో కొన్ని రోజులపాటు వాయిదా వేశారు.

1268
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

country oven

Featured Articles

Health Articles